Home వార్తలు తెలంగాణ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి వారిని సన్మార్గం లో నడిపించే మార్గదర్శి గురువు

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి వారిని సన్మార్గం లో నడిపించే మార్గదర్శి గురువు

0

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి వారిని సన్మార్గం లో నడిపించే మార్గదర్శి గురువు

భాషోపాధ్యాయులకు పదోన్నతుఇచ్చిన ప్రజా ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలి

పోలోజు శ్రీహరి రచించిన రాష్ట్ర భక్తి గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో :(వై. లకుమయ్య ) : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు అని,తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత చూపే ఆదర్శమూర్తి ఉపాధ్యాయుడుఅని, తల్లీ తండ్రులు కనిపెంచితే గురువులు పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి వారిని సన్మార్గం నడిపించే భాధ్యత గురువు తీసుకుంటాడు అని, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటిసరఫరా, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ, సీతక్క అన్నారు.ఆదివారం హాన్మకొండ టిటిడి కళ్యాణ మంటపం లో రాష్ట్ర ప్రభుత్వంభాషోపాధ్యాయులకు పదోన్నతి కల్పించిన సందర్భంగా,ప్రభుత్వానికి కృతజ్ఞత భాషాంజలి, ఆత్మ గౌరవ సభ కు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరా, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హాజరై మాట్లాడుతూ తెలంగాణ
లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన వెంటనే, ప్రజా భవన్ కంచెలు తొలిగించినం, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం కోసం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం అన్నారు.పదేళ్లుగా వాయిదాలు పడుతున్న, అన్ని ఉద్యోగాలను భర్తీ చేశాం మని,15 వేల మంది పోలీస్ సిబ్బందిని కొత్తగా నియమించాం మని,1,637 ఇంజినీరింగ్ పోస్టులు, 65 రోజుల్లోనే 11,067 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం, డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించిన నియామక పత్రాలు అందించామని తెలిపారు.
గత 10 యేండ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలెదని,పేపర్ లీకేజి లు చేసి, విద్యార్థులతో ఆటలు అడుకున్న గత ప్రభుత్వం అని,
యువకుల పట్ల ప్రేమ ఒలకపోయడం, నీచం మైన బుద్ధి అని,నిరుద్యోగుల భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని,వాళ్ళ మాయమాటలు నమ్మద్దని, మంత్రి సీతక్క అన్నారు. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు శుభా కాంక్షలు తెలుపుతూ, విద్యావేత్తలు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రజా పాలన అందిస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని సీతక్క అన్నారు. అనంతరం పోలోజు శ్రీహరి రచించిన రాష్ట్ర భక్తి గీతాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి తో పాటు ఉపాధ్యాయ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story : పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి వారిని సన్మార్గం లో నడిపించే మార్గదర్శి గురువు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version