Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం

వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం

0

వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని సాలే వీధిలో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో తొమ్మిదవరోజు అమ్మవారు మహిషాసుర మర్దినీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ వారు తెలిపారు. పట్టణంలోని సాలే వీధిలో గల అంబా భవాని దేవాలయంలో 9వ రోజు అమ్మవారు ధనలక్ష్మి దేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ నిర్వహణ స్వకుల సాలే సమాజము, స్వకుల సాలే మహిళా మండలి, అంబా భవాని దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణములోని యాదవ వీధిలో గల గాయత్రీ దేవాలయంలో 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలు దాతలు, భక్తాదులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చక సంక్షేమ సంఘం, గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం, వేద మాత గాయత్రీ దేవి ఆలయ కమిటీ వారు నిర్వహించారు. (Story : వివిధ రూపాల అలంకరణలో భక్తాదులకు దర్శనం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version