శ్రీ కామాక్షి దేవాలయం లో చండీ మూలమంత్ర హోమం
న్యూస్ తెలుగు / విజయనగరం : బొండాడవీధిలో కొలువై ఉన్న శ్రీ మహాగణపతి కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవాలయంలో శరన్నవరాత్రుల భాగంగా బుధవారం ఋత్వికులు వేదమంత్రాల సాక్షిగా చండీ మూలమంత్ర హోమం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. పాలకమండలి అధ్యక్షుడు అప్పలబత్తుల సోమరాజు మాట్లాడుతూ అక్టోబర్ 10 వతేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు పట్టణ పురవీధుల్లో మహిళ మండలి సభ్యులచే ఊరేగింపుగా అమ్మవారికి 108 రకాల పిండివంటలతో ‘సారె’ సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నాగమల్లి లోకనాధ గణపతిరావు,కాకినాడ శశిభూషణరావు,మందరపు వరహాచారి,నాగమల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.(Story:శ్రీ కామాక్షి దేవాలయం లో చండీ మూలమంత్ర హోమం)