న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : విదేశీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు బతుకమ్మ ప్రారంభ ఉత్సవాలలో పాల్గొని అక్కడి తెలుగువారైన సోదర సోదరీమణులకు కలసి దసరా నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. న్యూజిలాండ్ మినిస్టర్ కరెన్ చౌర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యం కలిపించిన ఘనత కెసిఆర్ ది అని అన్నారు. ఒకప్పుడు తెలంగాణకు మాత్రమే పరిమితమైన దశలో తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను జోడించటంతో బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైందని అందుకు కృషి చేసిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అభినందనీయులు అని కొనియాడారు.
ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగువారందరూ ఆయా దేశాలలో బతుకమ్మ ఉత్సవాలు జరిపి తెలంగాణ పూల సుగంధాలు వ్యాపింపచేస్తున్నారు అని అన్నారు. ఈ విజయ దశమి అందరి జీవితాలలో సుఖసంతోషాలు నింపాలని వారు చేసే పనులు విజయవంతంగా జరగాలని అన్నారు.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమములో పరంజ్యోతిజీ ఎం.పి,సంజీవ్ కుమార్,కళ్యాణ్ రావు,రామ్మోహన్,రామారావు,అరుణ్ ప్రకాష్,పోకల.కిరణ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. (Story : న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు)