పెన్షన్లు పంపిణీలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి
న్యూస్ తెలుగు /సాలూరు: వృద్ధులు వికలాంగులు పెన్షన్లు తీసుకుంటుంటే వారి ఆనందానికి అవధులు లేవని రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం సాలూరు పట్టణంలో గల 26 వార్డులో గల వెంకటేశ్వర కాలనీలో ఎన్ టీ ఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు .ఈ సందర్భంగా నడవలేని వృద్ధులకు వికలాంగులకు స్వయంగా ఆమె ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు .
ఈ పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారము పెన్షన్లు పెంచడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని తెలిపారు. వెంకటేశ్వర కాలనీ చెరువుగట్టు ప్రాంతాలలో జరిగింది . ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది చిట్టి. కేతిరెడ్డి చంద్ర. బలగ శ్రీనివాసరావు పైడిరాజు .మాజీ కౌన్సిలర్లు నిమ్మది శ్యామల బలగ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. (Story : పెన్షన్లు పంపిణీలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి)