ఉపాధి హామీ కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించేందుకు ప్రణాళికలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఉపాధి హామీ కూలీలకు 2025-26 సంవత్సరంలో అత్యధిక పనిదినాలు కల్పించేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పరిషత్, మండల అభివృద్ధి అధికారులు, ఎపీఒలతో సమావేశం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025-26 సంవత్సరానికి పనుల ఎంపికకు తయారు చేయవలసిన ప్రణాళిక, తయారులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పనుల ఎంపిక గ్రామ సభల నిర్వహణ పై అదనపు కలక్టర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ ఉమాదేవి, జెడ్పి సీఈవో యాదయ్య, అడిషనల్ డి ఆర్ డి ఓ రామ మహేశ్వర్ రెడ్డి, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈవోలు, టిఏలు, మరియు ఎఫ్ఏలు పాల్గొన్నారు. (Story : ఉపాధి హామీ కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించేందుకు ప్రణాళికలు )