గౌరవెళ్ళి రిజర్వాయర్ కు రూ.లు 1000 కొట్లు విడుదల చేయండి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ
గత బిఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదు
గౌరవెల్లి నిర్వాసితులకు అన్యాయం చేసిన కెసిఆర్
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిపిఐ జాతీయ నేత, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి వినతి
న్యూస్ తెలుగు /సిద్ధిపేట జిల్లా ప్రతినిధి (నారదాసు ఈశ్వర్): హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి నిధులు లేక కెనాల్స్ నిర్మాణ పనులు నిలిచిపోయిన నేపథ్యంలో యుద్ధప్రాతికగా పూర్తి చేయడానికి వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, భీమదేవరపల్లి,
గంగాధర,సిరిసిల్ల మెట్టప్రాంతాలు కరువు ప్రాంతాలకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు, త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో భారత కమ్యునిస్టుపార్టీ (సిపిఐ) ప్రజా పోరాటాలు1980 నుండి ప్రారంభించడం జరిగిందని ఆ ఉద్యమ ప్రాధాన్యతను గుర్తించిన దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ జనగామాలో జరిగిన భారీ బహిరంగ సభలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుండి మధ్య కాలువ చేపట్టి మెట్టప్రాంతాలకు సాగునీరు అందించబడుతున్నదని ప్రకటించారని ఆ తర్వాత శ్రీరాంసాగర్ వరద కాలువకు శంకుస్థాపన చేయబడినదని చాడ వెంకటరెడ్డి అన్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత నేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞాన్ని చేపట్టి వరద కాలువకు ఇందిరా కాలువగా నామకరణం చేశారని, శ్రీరాంసాగర్ వరద కాలువలో భాగంగా గౌరవెళ్ళి,గండిపల్లి, తోటపల్లి లిఫ్టు కెనాల్, కెనాల్స్‌కు 2007లో నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేశారని అనివార్యంగా గత బిఆర్ఎస్ పాలన కెసిఆర్ ప్రభుత్వంలో భూసేకరణ చేపట్టిన పిదప తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేయబడి తోటపల్లి రిజర్వాయర్ నుండి లిఫ్టు కెనాల్ పనులు 90 శాతం వరకు పూర్తికాబడి,మిగతా ఫిన్సింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని గత ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా వరద కాలువ పనులను ప్రాధాన్యతనిచ్చి వేగవంతంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని,
కేసిఆర్ ప్రభుత్వంలో గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచినందువలన అక్కడ కూడా దాదాపు 80శాతం పనులు పూర్తికాబడ్డాయని వివరించారు.గుడాటిపల్లి, తెనుగుపల్లి, ఇతర తండాలు ముంపుకు గురవుతున్నందున పునరావాస ప్యాకేజి క్రింద రైతులకు,ప్రజలకు చెల్లించాల్సిన డబ్బులు ఇప్పటికి పెండింగ్‌లో ఉండటంతో పనులు నిలిచిపోయాయని ఆవేదన వెలిబుచ్చారు.గత ఏడాది రిజర్వాయర్‌లో నీళ్ళు నిల్వచేస్తారని ఆశించినా, అమలుకాలేదని గ్రామాలు ఖాళీ చేయలేక వేరే ప్రదేశానికి వెళ్లడానికి పూర్తిస్థాయిలో డబ్బులు రాన్నందున నిర్వసితులు దిక్కుతొచని స్థితిలో వున్నారని ముంపు గ్రామాల ప్రజలు దినదిన గండంగా బ్రతుకులు వెల్లదీస్తు గండిపల్లి రిజర్వాయర్ పనులు కేవలం 50శాతం వరకు మాత్రమే పూర్తి కావడం బాధాకరమన్నారు.
నిధుల లేమితో ప్రాజెక్టు నిర్మాణం పనులు నిలిచిపోయి రిజర్వాయర్ పనులను ఈ వేసవి కాలములో పూర్తి చేయబడినచో జూన్, జూలైలలో నీళ్లు నిల్వ చేసుకునే అవకాశమేర్పడుతుందని
ఆశించిన గౌరవెల్లి,
గండిపల్లి రిజర్వాయర్ల నుండి కెనాల్స్ కొద్ధి దూరం త్రవ్వబడి కేవలం 55 శాతం పూర్తి అయ్యాయని జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు వెళ్ళాల్సిన కెనాల్ పనులకు ఇప్పటికి భూసేకరణ పూర్తికాలేదని. ఇంకా కొంతమంది గౌరవెల్లి నిర్వాసితులకు నష్టపరిహారం,పునరావాస ప్యాకేజి ఇవ్వవలసి ఉన్నప్పటికీ తోటపల్లి రిజర్వాయర్ ఇందూర్తి నుండి భీందేవరపల్లి వరకు వెళ్లాల్సిన కెనాల్ పనులు 70శాతం మాత్రమే పూర్తి అయినవని తిమ్మాపూర్ (ఎల్.యం.డి) మానకొండూరు మండలాలలోని గ్రామాలకు సాగునీరు అందించడానికి కెనాల్స్ పనులు పెండింగ్‌లో ఉండటంతో ప్రజలలో నిరాశ పెరిగిపోతున్నదని
పెండింగ్ లో ఉన్న పనులకు ప్రధానంగా రిజర్వాయర్లు, కెనాల్స్, భూసేకరణకు సరిపడే నిధులు మంజూరి చేయాలని కోరారు.మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి, తిమ్మాపూర్, మనకొండూరు,
కోహెడ,హుస్నాబాద్,
భీందేవరపల్లి,ఎల్కతుర్తి ప్రాంతాలు తీవ్రమైన కరువు ప్రాంతాలు అయినందున శ్రీరాంసాగర్ వరద కాలువలో భాగంగా గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి అయినప్పటికీ కెనాల్స్ పూర్తయినప్పటికీ నీళ్లు నిలువ ఉంచుకోవాల్సి వచ్చిందని ఎన్‌జిటి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) అభ్యంతరం ఉన్నందున రిజర్వాయర్ పరిధిలోని పునరావాస లాభోక్తులు, భూసేకరణకు, షెడ్లకు డబ్బులు చెల్లించనందున నిధులు మంజూరి చేసి ఉన్నందున తక్షణమే చెల్లింపులు జరిపి యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు.ప్యాకేజి 3 ఇందూర్తి కెనాల్స్‌కు సంబంధించి చిగురుమామిడి మండలం రేకొండ మీదుగా భీందేవరపల్లి వరకు కాలువకు కల్వర్ట్ సిమెంట్ పనులు పూర్తి చేయడానికి రూ. 300 కోట్లకు ప్రతిపాదనలున్నందున పూర్తి చేయడానికి నిధులు మంజూరి చేయవలసివుందని,కాగా
గండిపల్లి ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయడానికి రూ.300 కోట్లు మంజూరి చేసి పూర్తి చేసి మొత్తం వరద కాలువ ద్వారా ఒక లక్ష 20వేల ఏకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశముంటుందని చాడ అందజేసిన లేఖలో పేర్కొన్నారు.
గత 30 సంవత్సరాల నుండి నత్తనడకన సాగుతున్న వరద కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్వయంగా కలిసి లేఖను అందజేసినట్లు అందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి నిధుల విడుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు. (Story : గౌరవెళ్ళి రిజర్వాయర్ కు రూ.లు 1000 కొట్లు విడుదల చేయండి)