ఘనంగా మాజీ శాసనసభ్యులు మక్కెన జన్మదిన వేడుకలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు 59వ జన్మదిన వేడుకలు అభిమానులు మధ్య పట్టణ సమీపంలో గల సెయింట్ ఆన్స్ చెవిటి, మూగ, మానసిక వికలాంగుల పాఠశాల ఆవరణలో భారీ కేకు కట్ చేసి దివ్యాంగులకు పంచిపెట్టారు. అనంతరం వారికి దుప్పట్లు, స్టీల్ ప్లేట్లు అందజేశారు. అనంతరం అన్నసంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వెంకట్ రత్నం, గుడివాడ గురునాథం, రోడ్డ వీరాంజనేయరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మక్కెన మల్లికార్జున రావు ఎంతో క్రమశిక్షణ నిబద్ధత కలిగిన నాయకుడని ఆయన మరి ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఇలానే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ నన్నేసా గోవిందరాజులు, ఇశ్రాయేలు, డి.కొండాచారి, వజ్రాల కృష్ణారెడ్డి, మన్యం వెంకటేశ్వర్లు, ఎర్రం శెట్టి జయరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా మాజీ శాసనసభ్యులు మక్కెన జన్మదిన వేడుకలు)