UA-35385725-1 UA-35385725-1

నామినేటెడ్ పోస్టులన్నీ తక్షణమే భర్తీ చేయాలి

నామినేటెడ్ పోస్టులన్నీ తక్షణమే భర్తీ చేయాలి

సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు

న్యూ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులన్నీ తక్షణమే భర్తీ చేసి పరిపాలనా పరంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం గత మూడు నెలల నుంచి మండలంలో స్టోర్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు, మధ్యాహ్నం భోజన పథకం ఏజెన్సీల కు సంబంధించిన వివిధ రకాల నామినేటెడ్ పదవులను నేటికీ భర్తీ చేయకపోవడంతో సంబంధిత అధికారులు తమ విభాగానికి సంబంధించిన కార్యకలాపాలను అమలు చేయడానికి అవకాశం లేకుండా పోతుందన్నారు, ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కూలీలతో పనులు చేయించడంలో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో పని కల్పించేవారు లేక గత మూడు నెలలుగా కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, మండల వ్యాప్తంగా సుమారు 25, 756 వేల మంది కూలీలు ఉండగా వారిలో 21,900 మంది పూర్తిగా ఉపాధి హామీ పథకం పనుల మీదనే ఆధారపడి జీవిస్తున్నారు అని, ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా సుమారు 35 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా వాటిలో ఒకటి రెండు మినహా మిగిలినవి నేటికీ భర్తీ చేయకపోవడంతో కూలీలతోపాటు సంబంధిత కార్యాలయం సిబ్బంది కూడా సకాలంలో పనులు జరగక ఇబ్బందులు పడుతున్నారన్నారు అని తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులు పండ్ల మొక్కలు నాటుకోవడంలో భాగంగా ఇప్పటివరకు అధికారులు 500 ఎకరాల్లో ఎస్టిమేట్లు సిద్ధం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ లేక
ఆ పనులు కూడా ప్రారంభించడానికి అవకాశం లేకుండా పోతోందన్నారు. అదేవిధంగా ఎన్నికల అనంతరం నుంచి స్టోర్ డీలర్లు కూడా లేకపోవడంతో ప్రభుత్వమే చౌక ధాన్య దుకాణాల నిర్వహణ చేపట్టడంతో ప్రజలకు సకాలంలో రేషన్ బియ్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు, ఇదిలా ఉండగా మండల వ్యాప్తంగా యానిమేటర్లను కూడా నేటికీ నియమించకపోవడంతో స్వయం సహాయక సంఘాల గ్రూప్ సభ్యులకు తమ రుణాలకు సంబంధించి రికార్డులు పరవేక్షించేవారు లేక డ్వాక్రా సభ్యులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు. అదేవిధంగా మండలంలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణలో భాగంగా ఏజెన్సీలను కూడా ఇప్పటికీ నియమించకపోవడంతో మధ్యాహ్నం భోజనం లభించక చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని విచారణ వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా ప్రస్తుతము అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకుల అనైక్యత వలన నియోజకవర్గంలోనే పెద్ద మండలం గా పేరుగాంచిన ఈ ప్రాంతంలో నామినేటెడ్ పోస్టులన్నీ పెండింగ్లో పడటంతో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ముఖ్యంగా ఈ పదవుల పైన ఎంతో ఆశాభావంతో ఉన్న కార్యకర్తలు తమకు ఎటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. కూటమి సభ్యులు ఐకమత్యంగా లేకుండా ఎవరికి వారే అన్న తీరుగా వ్యవహరిస్తుండడంతో భవిష్యత్తులో తమకు దిక్కు ఎవరని తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కలిసికట్టుగా వ్యవహరించి, భేదాభిప్రాయాలు పక్కనపెట్టి, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు కట్టబెట్టి, తద్వారా పరిపాలన పరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు, లేనిపక్షంలో త్వరలోనే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తాము మండలంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ను, తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ను కలిసి విన్నవిస్తామని తెలిపారు. (Story : నామినేటెడ్ పోస్టులన్నీ తక్షణమే భర్తీ చేయాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1