టిడిపి యాప్ ద్వారా అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ సాధించిన వారికి ప్రశంసా పత్రాలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : టిడిపి యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృత స్థాయిలో షేర్ చేసి ఉత్తమ పర్ఫామెన్స్ సాధించిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు ప్రశంసా పత్రాలను స్థానిక ఎమ్మెల్యే జి.వి ఆంజనేయులు అందజేశారు. ఈ సందర్బంగా ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన టిడిపి యాప్ ద్వారా అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ సాధించిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలియజేసి వారికి ప్రశంస పత్రాన్ని అందజేసి సన్మానించిన జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర మొదలుకొని గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అద్భుత విజయం సాధించే వరకు అనేక రకాలుగా పార్టీకి సేవలందించి పార్టీకి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మన టిడిపి యాప్ ద్వారా వాస్తవాలను ప్రజలకు చేరవేయటంలో అత్యుత్తమ పెర్ఫార్మన్స్ సాధించిన అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పార్టీకి అండగా నిలిచిన మీలాంటి కార్యకర్తలకు ఇచ్చిన తీర్చుకోలేనిదని నాటి ప్రభుత్వం అన్ని విధాలుగా మన టిడిపి పార్టీని కట్టడి చేయాలని చూసిన చివరికి కేసులు పెట్టిన లెక్కచేయకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన టిడిపి యాప్ ను మరింతగా ప్రజలకు చేరావేయాలని, మీ కృషిని ఇలాగే కొనసాగిస్తూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి తనను ఓడించారని కక్షతో రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బతీయటానికి జగన్ చేస్తున్నాం అబద్దపు ప్రచారాలను టిడిపి శ్రేణులు తిప్పికొట్టాలని, ముఖ్యంగా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడంలో పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఏ సమయంలో అయినా స్పందించటానికి సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పఠాన్ అయూబ్ ఖాన్, పత్తి పూర్ణచంద్రరావు, పీవీ సురేష్ బాబు, రాపర్ల జగ్గారావు, వెలిశెట్టి రంగయ్య, మొగిలి వెంకట్రావు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. (Story : టిడిపి యాప్ ద్వారా అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ సాధించిన వారికి ప్రశంసా పత్రాలు)