ఘనంగా గణేష్ ఉత్సవాలు తొమ్మిదో రోజు
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక కొండమెట్ల వద్ద స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు వినాయక చవితి పండగ సందర్భముగా గణేష్ ఉత్సవాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఆలయంలో ఉదయం స్వామివారికి 11 రకాల అభిషేకాలు సహస్రనామార్చన, గణపతి నవగ్రహ సమేత ఆంజనేయస్వామి మొదలగు రోమములు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో వినుకొండ కొండ అభివృద్ధి మెట్ల అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కమిటీ వారు ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ గుమ్మడి సదాశివరావు, పేరూరి శ్రీనివాసరావు, బ్యాంకు నాగేశ్వరరావు, పువ్వాడ సుబ్రహ్మణ్యం, అరవింద్, అడ్డగిరి తారక్, ఎంపీ నరసింహారావు, కాసాని వెంకట సుబ్బారావు, సన్ శెట్టి వెంకట సుబ్బారావు, కాకుమాను కోటేశ్వరరావు, కార్యక్రమాల అనంతరం లడ్డూ వేలంపాట మరియు వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.