అన్నదాత సుఖీభవ నిధులు మంజూరు చేయాలి
న్యూస్ తెలుగు /సాలూరు : రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి నిధులు మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని సాలూరు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ సాలూరు మండలంపెదపదం గ్రామ సచివాలయం లో శుక్రవారం వినతి పత్రo ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు రైతులు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం క్రింద ప్రభుత్వం ఇస్తామన్న 20000 రూపాయలు వెంటనే ఇవ్వాలని కోరారు 2023 ఖరీఫ్ రవి సీజన్లో కరువు తుఫాను వల్ల నష్టపోయిన పంటలకు బీమా సౌకర్యం ఇవ్వాలని అన్నారు. సమగ్ర ఉచిత పంటల బీమా అమలు చేయాలని కోరారు. రైతులు తీవ్రమైన అప్పుల్లో కూలిపోయారని రైతులను తక్షణ ఆదుకోవాలని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బాటలోనే ఈ ప్రభుత్వం కూడా విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తుందని దానికి అనుగుణంగా జీవనెంబరు 22ను ఇచ్చిందని ఇచ్చిన జీవో అని వెంటనే రద్దు చేయాలని తెలిపారు. కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల పథకం ద్వారా నార్లవలస పెదపదం పురోహి తుని వలస బోరబంద పంచాయతీల గ్రామాల రైతులకు సాగునీరు అందించాలని నేటికీ ఈ సమస్యను పరిష్కారం చేయడం లేదని తెలిపారు. పై సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు నాగేశ్వరరావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. (Story : అన్నదాత సుఖీభవ నిధులు మంజూరు చేయాలి)