క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ నుంచి క్రిమిసంహారక ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా విడుదల
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ప్రముఖ వ్యవసాయ రసాయన సంస్థ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, మొక్కజొన్న, సోయాబీన్ పంటల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తాజా పురుగుమందు ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రాను విడుదల చేసింది. ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా అన్ని రకాల గొంగళి పురుగుల నుండి ముఖ్యంగా ఫాల్ ఆర్మీ వార్మ్ (కత్తెర పురుగు), స్పోడోప్టెరా (పొగాకు లద్దె పురుగు) నుండి సమర్థవంతమైన రక్షణను అందించడానికి రూపొందించబడిరది. ఇది దీర్ఘకాలిక పంట భద్రతను నిర్ధారిస్తుంది. పంట కాలంలో గరిష్ట దిగుబడిని పొందడానికి రైతులకు సహాయపడుతుంది. ఈ వినూత్న పరిష్కారం పంట ఆరోగ్యం, ఉత్పాదకను పెంచడానికి రైతులకు దోహదపడుతుంది ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా అనేది కాంటాక్ట్, సిస్టమిక్, ట్రాన్స్‌లామినార్ పురుగుమందు, ఇది గొంగళి పురుగులను పక్షవాతానికి గురి చేసి పంటకు నష్టం జరగకుండ దోహదపడుతుంది. (Story :క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ నుంచి క్రిమిసంహారక ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా విడుదల) క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ నుంచి క్రిమిసంహారక ప్రొక్లెయిమ్ ఎక్స్‌ట్రా విడుదల