నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన యూ పిహెచ్సి వైద్యులు
న్యూస్‌తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీవో నెంబర్ 85 కు వ్యతిరేకంగా ధర్మవరం డివిజన్లోని వైద్యులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను నిర్వర్తిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ
పవిత్రమైన వైద్య వృత్తిని రోజు చేస్తున్న తాము కోవిడ్, ఇతర అత్యవసర ప్రాణాంతకర పరిస్థితులలో తాము చేసిన సేవలను ఫ్యామిలీ ఫిజీషియన్ పేరుతో సుదూర గ్రామాలలో ఏటువంటి అదనపు ఆదాయం ఇవ్వకుండా మాతో చేయిస్తున్న సేవలను గుర్తించకపోవడం గర్హ నీయమైన ఇటువంటి తరుణంలో PG వైపు వైద్య ప్రవేశ అవకాశాలను, జీవితోన్నతినీ నిర్వీర్యం చేసేదిశగా ప్రభుత్వం జీవో నెంబర్ 85 ను తీసుకురావడం పుండు మీద కారం చల్లినట్లు ఉందని తెలిపారు
రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు నిరసన సఫలం అయిన పక్షంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఏడు రోజుల కార్యాచరణను దశలవారీగా కొనసాగిస్తూ 8వ రోజు నుంచి రాష్ట్రవ్యాప్త వైద్యులు నిరాహార దీక్షకు సంసిద్ధం అని అన్నారు.
పలుచోట్ల వైద్యులు చేసే నిరసన గురించి ఆరాతీ సిన రోగులు ప్రజలు ఈ జీవోను సహేతుకత ను ప్రశ్నించడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో ధర్మవరం డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మరియు అర్బన్ ఆరోగ్య కేంద్ర వైద్యులు, పిపి యూనిట్ వైద్యులు , ఇతర వైద్య బృందం నిరసనలో పాల్గొనడం జరిగింది. (Story : నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన యూ పిహెచ్సి వైద్యులు)