మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనుల ప్రతిపాదనలను సిద్ధం చేయాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
న్యూస్ తెలుగు /ములుగు : మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనుల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి , దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ మాట్లాడుతూ మేడారం జాతర అభివృద్ధి పనుల ప్రతిపాదనలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్ లలో త్రాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని , అదే విధంగా క్యూ లైన్ లో ఉండే భక్తులకు నిడ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని, గద్దెల ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా, పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, ప్రభుత్వ సెలవులలో జాతరకు వచ్చే భక్తులకు అని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
అధికారులు ప్రణాళిక బద్దంగా సమయపాలన పాటిస్తూ,పనులు పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం మేడారం పూజారులు జిల్లా కలెక్టర్ ను, అదనపు కలెక్టర్ లను శాలువాతో సత్కరించి అమావార్ల బంగారం అందించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి రాజేందర్ , తాడ్వాయి మండల తహసిల్దార్ రవీందర్ , మేడారం పూజరుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు,తదితరులు పాల్గొన్నారు. (Story : మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనుల ప్రతిపాదనలను సిద్ధం చేయాలి)