Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0

 వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

న్యూస్ తెలుగు /నల్లగొండ : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు.అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైనచోట సహాయ సహకారాలు అందించాలన్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురియనున్న దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలిఅలాగే మట్టి మిద్దెలు ,కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరు నివాసం ఉండొద్దు మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులకు తెలియజేస్తే అవసరమైతే తక్షణమే వసతి కల్పించడం జరుగుతుంది అని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, మూసి ప్రాజెక్టుల గేట్లు తెరిచినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలలో నీటిలోకి ఎవరు వెళ్లొద్దు .పశువులను సైతం నీటిలోకి తీసుకెళ్లొద్దు అని తెలిపారు.ఈత కొట్టేందుకు యువత నదులు ప్రాజెక్టుల వద్ద నీటిలోకి దిగవద్దు మత్స్యకారులు చేపలు పట్టేందుకు నీళ్లలోకి వెళ్ళవద్దు పిల్లలు, పెద్దలు నీటి ప్రాంతాల వద్ద సెల్ఫీలు దిగేవారు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు.వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మలకు షార్ట్ సర్క్యూట్ వచ్చేందుకు అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా మనుషులు, పశువులు వెళ్లొద్దు విద్యుత్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కోరారు.విద్యుత్ అధికారులు ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్న వాటిని గుర్తించి ముందే తొలగించాలి వర్షం ,గాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపోయిన, స్తంభాలు ఒరిగిపోయిన తక్షణమే సరి చేయాలి మున్సిపల్ ప్రాంతాలు, గ్రామాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలిఎక్కడైనా నీరు నిలువ ఉంటే తక్షణమే నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.మున్సిపాలిటీలు ,గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలి కల్వర్టులు, రోడ్లు పొంగిపొర్లుతున్నట్లయితే వాటిని దాటే సాహసం ఎవరు చేయొద్దు అని సూచించారు.ఆర్ అండ్ బి ,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అలాంటి ప్రదేశాలలో తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి . బారికేడ్లు ఏర్పాటు చేయాలి మోటార్ బైకులు వాహన దారులు పొంగి పొర్లి ప్రవహించే కల్వర్టులు, వాగులను దాటే సాహసం చేయవద్దు.వర్షం వల్ల రోడ్లపై చెట్లు విరిగిపడినట్లయితే తక్షణమే తొలగించాలి అని అన్నారు .నీటిపారుదల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వర్షాల కారణంగా చెరువులు ,కుంటలు ఎక్కడైనా నిండి తెగిపోయేందుకు ఆస్కారం ఉన్నచోట తక్షణమే వాటిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలి.వర్షం వల్ల రైతులు పంటలు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలి అని అన్నారు.వర్షాల కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడిన ప్రజలకు తక్షణ చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి అవసరమైన మందులు, మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలి రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైనచోట సహాయక చర్యలను చేపట్టాలి జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అందరూ జిల్లా యంత్రంగానికి అందుబాటులో ఉండాలి అని అన్నారు .నల్లగొండ డివిజన్ పరిధిలోని ప్రజలకు
ఏమైనా అత్యవసర సహాయం అవసరం
వున్నచో సహాయక చర్యలను చేపట్టుటకు
గాను రెవెన్యూ డివిజన్ కార్యాలయం
నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి (24)
గంటలు అందుబాటులో కలదు.
సంప్రదించవల్సిన వివరములు
1) శ్రీ కె. వెంకటేష్

ఉదయం 6.00
గం., నుండి సాయంత్రం 6.00 గం., వరకు
సెల్ నెం. 9010670408
2) శ్రీ యం. నాగేశ్వర్ – సాయంత్రం
6.00 గం., నుండి ఉదయం 6.00 గం.,
వరకు
సెల్ నెం. 8074522583 (Story : వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version