హైదరాబాద్‌లో ఘనంగా ట్రైల్ బ్లేజింగ్ మహిళల సమావేశం
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: సేల్స్ ఫోర్స్ అనేది ‘1 ఏఐ సిఆర్‌ఎం’. అది భారత దేశంలో హైదరాబాద్‌లో రెండవ ట్రైల్ బ్లేజింగ్ మహిళల సమావేశాన్ని నిర్వహించింది. ఈ వార్షిక లింగ సమావేశం ద్వారా సేల్స్ ఫోర్స్ ఒక వేదికని ఏర్పాటు చేసి తరువాత తరం మహిళా నాయకులకు, పురుష మిత్రులకు ఒక వేదికని తయారు చెయ్యాలి అనుకుంటుంది. ఈ సమావేశంలో వ్యక్తిగతంగా 350కిపైగా ఆడవారు పాల్గొన్నారు. 3000కిపైగా వర్చువల్ లైవ్ స్ట్రీమింగ్‌కి రిజిస్టర్ చేసుకున్నారు. ‘ఆధునీకరణని ప్రేరేపించడం’ ఈ సన్నివేశం ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశం భారత దేశంలో ఉన్న మహిళా నాయకులని, మిత్రులని, వ్యాపార నాయకులను, ప్రేరణని అందించే ప్రముఖులను ఒక దగ్గర చేర్చి ప్రేరణని అందించింది. సేల్స్ ఫోర్స్ సిఈవొ, చైర్‌పర్సన్ అరుంధతీ బట్టాచార్యా వివిధ ప్యానల్ చర్చలు, ఫైర్ సైడ్ చాట్ తరువాత ఈ సమావేశాన్ని మొదలుపెట్టారు. మహిళల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లేందుకు పరివర్తన సాంకేతికపరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, ఆవిష్కరణలను ప్రేరేపించడం వంటి కీలకపాత్రను ఆమె నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమం వివిధ చర్చల తరువాత కొనసాగింది. ఈ సమావేశం వివధ మహిళా నాయకుల విజయాలను తెలియజెప్పింది. (Story : హైదరాబాద్‌లో ఘనంగా ట్రైల్ బ్లేజింగ్ మహిళల సమావేశం)