శ్రీ చైతన్య లో ఘనంగా జరిగిన “ఇన్వెస్ట్యుచర్” సెర్మని
న్యూస్‌తెలుగు/ విజయనగరం : స్థానిక రింగ్ రోడ్డులో గల శ్రీ చైతన్య పాఠశాల లోఇన్వెస్ట్వుచర్ సెర్మని జరిగింది.ప్రజాస్వామ్య స్ఫూర్తిని విద్యార్థులలో నింపేందుకు ఓటు హక్కు యొక్క ఉపయోగాన్ని విద్యార్థినీ, విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠశాల స్థాయి నుండే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికైన విద్యార్థులకు హెడ్ బోయ్, హెడ్ గర్ల్ తదితర నాయకులకు బ్యాడ్జీలను అందిస్తూ, ఇప్పటి నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాఠశాల ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వి. శ్రీనివాస రావు అన్నారు. పాఠశాల ఎన్నికలలో విజేత విద్యార్థులచే ప్రమాణం చేయించారు. విద్యార్థుల కార్యక్రమ నిర్వాహణ కొరకు నాయకుని ఎంపిక కొరకు ఎలక్షన్స్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ బాబు ఈ ప్రక్రియ విద్యార్థులకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించడం జరిగింది . ఈనాటి కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : శ్రీ చైతన్య లో ఘనంగా జరిగిన “ఇన్వెస్ట్యుచర్” సెర్మని)