శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి
న్యూస్‌తెలుగు / వెంకటపూర్ : వెంకటపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయం ను రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని మంగళవారం రాష్ట్ర సాంస్కృతిక, ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణా రావు, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తొ కలసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, భూపాలపల్లి, వర్ధన్నపేట, ఎమ్మెల్యేలు సత్యనారాయణరావు, నాగరాజు, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్., ఎస్పి షభరిష్, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ కే. సత్య పాల్ రెడ్డి, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు, జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి )