కెమేరాపట్టిన చంద్రబాబు
న్యూస్‌తెలుగు/అమరావతి : వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమేరాను తీసుకుని స్వయంగా సిఎం ఫోటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారిని అభినందించారు. నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని సిఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు. (Story : కెమేరాపట్టిన చంద్రబాబు )