ఈ పాపం ఎవరిది?
– ఆ మృత శిశువు ఎవరిది ?
– ప్రచారంలో భిన్నకథనాలు
– ఆ మృత శిశువు నాదే – తల్లి
– పద్దతి తప్పలేదు – ఆస్పత్రి వర్గాలు
– విచారణ కొనసాగుతోంది – సిఐ
న్యూస్ తెలుగు/ భద్రాద్రి కొత్తగూడెం : గోదావరి తీరంలోని రాళ్లపై ఈనెల 13వ తేదీన లభ్యమైన మృత శిశువు విషయం తాజాగా కలకలం రేగుతోంది. కాగా దీనిపై భిన్న కథనాలు వినవస్తున్నాయి. తమ ఆస్పత్రిలో చేరిన మాట వాస్తవమే అని, అప్పటికే గర్భంలో నుండి జారిపోయిన శిశువు సాధారణంగా బయటకు వచ్చిందని, కానీ ఆ శిశువు, గోదావరి రాళ్లపై లభ్యమైన శివువు ఒకటి కాదని, తమ ఆస్పత్రిలో అంతా పద్ధతి ప్రకారమే చట్టబద్దంగానే జరిగిందని ఆస్పత్రి వర్గాలు చెబుతుండగా, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తనకు అబార్షన్ చేసినట్లు తన అక్క చెప్పిందని, ఆ శిశువునాదే అని కూడా అక్కే చెప్పిందని, చాలా బాధవేసి మీడియా ముందుకు వచ్చానని, తనను నమ్మించి పెళ్లికాకుండానే తల్లినిచేసి ఇంతటి ఘాతుకానికి పాల్పడిన యువకుడు, ఆయన కుటుంబాన్ని, ఆస్పత్రి వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు అంటోంది. దీంతో అ మృత శిశువు ఎరిదో అనే విషయం పై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా విచారణ చేపట్టారు. వివరాల ప్రకారం….
ఏపిలోని చింతూరుకు చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకున్ని రెండేళ్లుగా ప్రేమించింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగగా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి గర్భవతిని చేయడంతో కడుపులో పిండానికి నెలలు నిండుకుంటున్నాయి. ఇరు వర్గాల కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని ఓ ఆస్పత్రిని సంప్రదించారు. బిడ్డ మృతి చెందగా తల్లి క్షేమంగా ఉంది. కాగా ఈనెల 13వ తేదిన కవర్లో చుట్టి గోదావరి నది రాళ్లపై ఎవరో శిశువును విసిరేశారు. అటుగా వస్తున్న వారి కంట పడటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గోదావరి రాళ్లపై దొరికిన శిశువు తనదే అని తల్లి, ఈ శిశువు ఆ యువతి శిశువుకు సంబంధం లేదని ఆస్పత్రి వర్గాలు తెలుపుకుందటంతో భిన్న కథనాలు వినవస్తున్నాయి..
ఆ శిశివు నాదే ///- తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తల్లిని చేశాడు. నెలలు నిండుకుంటున్న క్రమంలో గర్భంలో పెరుగుతున్న శిశువును తొలగించేందుకు ఆ యువకుడు, తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 10వ తేదిన మాత్రలు వేసిన నట్లు బాధిత యువతి తెలుపుతోంది. మాత్రలు వేసుకన్న తర్వాత కడుపులో పిండం పడిపోకపోగా, తీవ్ర అనారోగ్యం పాలయినట్లు, విపరీతమైన ఇబ్బంది ఎదురవడంతో ఆ యువకుని కుటుంబ సభ్యులతో పాటు తన సోదరితో కలిసి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి 12వ తేదిన వచ్చినట్లు యువతి స్వయంగా తెలుపుతోంది. నీరసంగా ఉన్న క్రమంలో వైద్యురాలు పరీక్ష చేశారని, తనతో ఆ సమయంలో సంతకం కూడా చేయించారని ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదని యువతి నా పోతోంది. అతర్వాత గోదావరి రాళ్లపై దొరికిన శిశువు తనదే అని తన అక్క చెప్పిందని, చాలా బాధవేసి మీడియాను సంప్రదించానని, ఇలాంటి పరిస్థితి కారకులైన యువకుని కుటుంబ సభ్యులతో పాటు ఆస్పత్రిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆ యువతి వేడుకుంటోంది.
పద్దతి తప్పలేదు ///- ముందుగానే గర్భం పోయేందుకు మాత్రలు మింగిన వారు ఆస్పత్రికి వచ్చి సంప్రదించారని అంతా పద్దతి ప్రకారమే వైద్య పరీక్షలు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలుపుతున్నాయి.
మహిళా వైద్యురాలిని సంప్రదించే క్రమంలో సదరు యువకుడు ఆ యువతి తన భార్యే అని తనపాటు వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి డాక్టర్ వద్దకు వెళ్లారని, యువతిని పరీక్షించిన వెంటనే స్కానింగ్ చేయించాలని డాక్టర్ సూచించడంతో స్కానింగ్ చేయించారని, అప్పటికే మందులు వాడున్నందున 24 నెలల పిండం గర్భ సంచిలో నుండి క్రిందికి జారి ఉండటంతో ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారని, అనంతరం రెండు, మూడు గంటల తర్వాత అప్పటికే జారిపోయి ఉన్న శిశువు సాధారణ ప్రసవంలా బయటకు వచ్చేసింది అని ఆస్పత్రి వర్గాలు తెలుపుతున్నాయి. తమ వద్ద స్కానింగ్ రిపోర్టుతో పాటు యువతిని ఆస్పత్రిలో చేర్పించే క్రమంలో సిసి కెమోరా రికార్డులు, సంతకాలు పెట్టిన పేపర్లు ఉన్నాయి. గర్భంలో శిశువు జారి పోయినప్పుడు జాగ్రత్త పడాల్సి ఉన్నందున వైద్యురాలు ఆ యువకుని భార్యను ఇన్వార్డులోకి తీసుకున్నారని అంటున్నారు. గర్భంలో మృతి చెంది పడిపోయిన శిశువును గ్రామపంచాయితీ సిబ్బందికి ఇచ్చి పాతిపెట్టమని చెప్పామని, సదరు గ్రామపంచాయితీ సిబ్బంది ఆ శిశువును పాతిపెట్టారని అన్నారు. తమ వద్ద ఉన్న స్కానింగ్ రిపోర్టు ప్రకారం గర్భంలోని శిశువు 24 నెలలు అని, గోదావరి రాళ్లపై లభ్యమైన శిశువు ఏడున్నర నెలలు ఉన్నాయని చెప్పారు. ఆ శిశువు, ఈ శిశువుకు సంబంధం లేదని, దీనిపై పోలీసులు విచారణ చేపట్టారని, తమ వద్ద ఉన్న అన్ని రకాల ఆధారాలు పోలీసులకు సమర్పించానుని. అంతా పద్ధతి ప్రకారమే చేసామని, గర్భంపోయేందుకు మందులు వేసుకుని ఇబ్బందికర పరిస్థితుల్లో ఆస్పత్రికి రానడు వల్ల తల్లి ప్రాణానికి ప్రమాదం తప్పిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
విచారణ కొనసాగుతోంది సంజీవరావు సిఐ /// పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుందంటూ ప్రచారం సాగుతున్న విషయంపై విచారణ చేపట్టినట్లు సిఐ సంజీవరావు తెలిపారు. గోదావరి రాళ్ల మీద దొరికిన శిశువుకు, ఆస్పత్రిలోని మృత శిశువుకు సంబంధం లేనట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోంది, విచారణ అంశాల ఆధారంగా దోషులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
భిన్నకథనాల వాదనల్లో పోలీసులు చేపడుతున్న విచారణ అనంతరం శివును పోగొట్టుకున్న ఆ తల్లి ఆవేదన తీరనుందా ?, పెళ్లి కాకుండానే తల్లిని చేసి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డ యువకుడు, అతని కుటుంబ సభ్యులు చర్యకు బాధ్యులా?, నిజంగా ఆస్పత్రి పై మచ్చ పడిందా అని నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. (Story : ఈ పాపం ఎవరిది?)