ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమమే ఏపీ జి ఈ ఏ లక్ష్యం
జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంది వెంకటరమణ, బి బాల భాస్కర్
న్యూస్తెలుగు/ విజయనగరం : ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లక్ష్యం అని ఏపీ జి ఈ ఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంది వెంకటరమణ, బి బాలభాస్కర్ అన్నారు. శుక్రవారం సంఘం యొక్క గుర్తింపు పొందిన రోజు సందర్భంగా సంఘ కార్యాలయం వద్ద ఉద్యోగ ఉపాధ్యాయులతో కలిసి జిల్లా అధ్యక్షులు కంది వెంకటరమణ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరమణ, బి బాలభాస్కర్ మాట్లాడుతూ పార్టీలతో కాదు ప్రభుత్వంతో భజనతో కాదు బాధ్యతతో అన్న సంఘస్పూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పోరాటాల కోసం ఎన్నడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ముందు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు చింతల వెంకట సతీష్, చంద్రశేఖర్, పువ్వల శ్రీనివాసరావు ,పి భూషణరావు,పి మేరీ, వై శంకర్రావు, పి చిన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. (Story : ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమమే ఏపీ జి ఈ ఏ లక్ష్యం)