మెగా రక్తదాన శిబిరం ను విజయవంతం చేయండి.. కన్నా వెంకటేష్
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా):అనంతపురం జిల్లా లోని రాయదుర్గం నియోజకవర్గంలో గల కనేకల్లు మండలం మాల్యం గ్రామంలోని కోటగడ్డ వినాయకుని గుడి దగ్గర ఈనెల 14వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మెగా రక్తదాన శిబిరమును నిర్వహిస్తున్నట్లు ధర్మవరం రక్త బంధం ట్రస్ట్, రజనీ ట్రస్ట్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, రక్తదానం చేసిన వారు మరొకరికి ప్రాణదానం చేసిన వారు అవుతారని తెలిపారు. కులాలకు, మతాలకు అతీతంగా ఈ రక్తదాన ను ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని విజయవంతం చేయుటలో తమ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ప్రతి రక్తదాత ఇచ్చే రక్తం ప్రమాదంలో గాయపడిన వారికి, గర్భిణీ స్త్రీలకు, తల సేమియా వ్యాధిగ్రస్తులకు పునర్జన్మను ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. కావున ఆసక్తి గల రక్తదాతలు అందరూ కూడా ఈ శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు(Story:మెగా రక్తదాన శిబిరం ను విజయవంతం చేయండి.. కన్నా వెంకటేష్.)