గ్రూప్-1 మెయిన్స్ ఎంపికలో మార్పు చేయాలి
చంద్రబాబు ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి
న్యూస్ తెలుగు/అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఎంపికలో 1:100 విధానం పాటించాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి సూచించారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆవేదనను గుర్తించి వారికి సీఎం చంద్రబాబు న్యాయం చేయాలని కోరుతూ, ఆదివారం ఆమె ట్వీట్ చేశారు. గ్రూప్-2, డిప్యూటీ డీవైఈవో పోస్టుల ఎంపికల తరహాగానే 1:100 విధానాన్ని అనుసరించినట్లేని తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్‌కి సైతం 1:100 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలని, గ్రూప్-2, గ్రూప్-1 పరీక్షలకు మధ్య సరైన సమయం లేకపోవడం, దాంతో విద్యార్థులు పరీక్షలకు పూర్తిగా సన్నద్ధులు కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అభ్యర్థుల జీవితాలను మనం గుర్తించి, గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పద్ధతిని పాటించాలని కోరారు. (Story : గ్రూప్-1 మెయిన్స్ ఎంపికలో మార్పు చేయాలి)