మాజీ ఎమ్మెల్యే మక్కెన ఆధ్వర్యంలో స్వాములకు సద్ది వితరణ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ మార్కాపురం రోడ్డు అయ్యప్ప స్వామి గుడి ఆవరణలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు స్వామి మాలలు ధరించిన స్వాములకు సద్ది వితరణ చేశారు.
తన మనవరాలు ప్రవీణ జన్మదిన సందర్భంగా వినుకొండ మార్కాపురం రోడ్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో కుటుంబ సమేతంగా తొలుత మనమరాలు పేరు మీదగా స్వామికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే… అనంతరం తను మనవరాలు జన్మదిన సందర్భంగా స్వాములకు ఏర్పాటుచేసిన సద్దిని వితరణ చేశారు. పూజల అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెన దంపతులకు కుమార్తె అల్లుడికి, ఆలయ చైర్మన్ గుడివాడ చిన్న గురునాథం ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వాముల ఆలయ తరుపున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story : మాజీ ఎమ్మెల్యే మక్కెన ఆధ్వర్యంలో స్వాములకు సద్ది వితరణ)