సీతంలో జాతీయ లైబ్రేరియన్స్, అంతర్జాతీయ యువజన ఉత్సవాలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : సీతం ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ లైబ్రేరియన్స్ దినోత్సవ, అంతర్జాతీయ యువజన ఉత్సవాలు నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మెకానికల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆఫీసర్ ఇన్చార్జి లైబ్రరీ జె.ఎన్.టి.యు- జి.వి, విజయనగరం నుండి డాక్టర్. సి. నీలిమ దేవి విచ్చేశారు. ఈ సందర్భంగాఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం పద్మశ్రీ డా.ఎస్.ర్ . రంగనాధన్ జన్మదినం అని తెలియజేశారు. ఆయన జన్మదినాన్ని స్మరించుకుంటూ, గ్రంథాలయాల స్థాపనకు ఆయన చేసిన కృషిని గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించి, గ్రంథాలయాలను తరచుగా ఉపయోగించుకోవడం వలన మన జ్ఞానాన్ని, వ్యక్తిగత ఆలోచనా విధానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని పెంచుతాయని చెప్పారు.
డైరెక్టర్ డాక్టర్ ఎం. శశిభూషణ్ రావు మాట్లాడుతూ, కళాశాల లైబ్రరీలో ఎన్నో రకాల అకడమిక్ పుస్తకాలతో పాటు ఈ తరం విద్యార్థులకు ఆసక్తి కలిగించే జీకే, కరెంట్ అఫైర్స్, రీసెర్చ్ పుస్తకాలుతో పాటు డిజిటల్ లైబ్రరీలో ఇ-జర్నల్స్, ఇ -బుక్స్ ఏర్పాటు చేశామన్నారు.ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వి. రామ్మూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమయంను వృధా చేయకుండా గ్రంధాలయాలను వినియోగించుకోవాలని సూచించారు.
కళాశాల గ్రంథాలయాధికారిణి డాక్టర్ లెంక సత్యవతి మాట్లాడుతూ తెలియని విషయాలు మంచి పుస్తకం చదవడం ద్వారా తెలుసుకుంటాం అని, గ్రంథాలయానికి రావడం అలవాటుగా చేసుకోవాలని, అలాగే గ్రంథాలయంలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు.అలాగే ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు కళాశాల చైర్మన్ బొత్స సత్యనారాయణ, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది, వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సీతంలో జాతీయ లైబ్రేరియన్స్, అంతర్జాతీయ యువజన ఉత్సవాలు)