ముంబైలో ప్రారంభించిన మొదటి భూగర్భ మెట్రో రైల్
న్యూస్‌తెలుగు/ముంబై : ముంబైలో తొలి అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీసు ప్రారంభమైంది. దీనికి ఆక్వా లైన్ అని పేరు పెట్టారు. మొదటి దశలో ఇది శాంటా క్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు ట్రైన్స్ నడుస్తాయి. ఈ 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని కొలాబా – బాంద్రా- SIPZ లైన్ అని కూడా పిలుస్తారు. దీని పని 2017లో ప్రారంభమైంది. ముంబై మెట్రో ఆరే కాలనీ నుండి కఫ్ పరేడ్ వరకు 27 స్టేషన్ల మధ్య నడుస్తుంది. రైళ్లు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. దీని కారణంగా 35 కిలో మీటర్ల ప్రయాణం దాదాపు 50 నిమిషాల్లో పూర్తవుతుంది. అదే రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తే దాదాపు 2 గంటల సమయం పడుతుంది. (Story : ముంబైలో ప్రారంభించిన మొదటి భూగర్భ మెట్రో రైల్)