ఫిబ్రవరి 9న జరిగే ‘రేలా ‘పండగ ను
విజయవంతం చేయండి
న్యూస్ తెలుగు /చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లో ఆదివారం ఏపీ ఆర్ కళాశాలలో జరిగిన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఆదివాసి ఉద్యోగుల సంక్షేమ మరియుసాంస్కృతిక సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషత్3898/90, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ సి ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక సమ్మేళనం రేల పండగ వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న నిర్వహిస్తామని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సోడి మురళి పేర్కొన్నారు. భారత దేశంలో ఐదవ షెడ్యూల్, ఆరో షెడ్యూల్లో ఉన్న ఆదిమ తెగలు దాదాపుగా 750 పైగా తెగలు ఉన్నాయని వాటన్నిటినీ రాజ్యాంగంలో 342 ఆర్టికల్ ప్రకారం ఆయా తెగల యొక్క భాషా సాంస్కృతి, సాంప్రదాయాలు ఆచారాలు అలవాట్లు, వారి విజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకుని ఆదిమ తెగలు గా గుర్తించడం జరిగిందని. 342 ఆర్టికల్ లో పొందుపరిచిన వారి లక్షణాలను అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో చాలా తెగలు కనుమరుగవుతున్నాయని ఎందుకంటే నేడు ఉన్న ప్రపంచీకరణ ప్రైవేటుకరణ, ఆధునీకరణ, సాంస్క్రిటైజేషన్ భాగంగా కాపాడుకోవడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని వాటిని కాపాడుకోవాలంటే భాషా సంస్కృతి పరిరక్షణ భాగంగా ఆదిమ తెగలు గలలో సాంస్కృతిక పునర్జీవం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
కొమరం భీం, బిర్సముండా, సమ్మక్క సారక్క,కారం తమన్న దొర అబుల్ రెడ్డి, సోయం గంగులు ఘంటం దొర,మల్లు దొర తదితర ఆదివాసీ తిరుగుబాటులో భూమి, అడవి, నీళ్లు కోసం తమ యొక్క జాతిని ఏకతాటి మీద తీసుకొచ్చి బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తేనే నేడు మనం అనుభవిస్తున్న ప్రతిఫలాలు అయినా పీసా చట్టం, 1/70, చట్టాలు, జీవో నెంబర్ 3 కి,బదులు షెడ్యూల్ ప్రాంతాలలో చదువుకున్న ఆదివాసి యువతీ యువకులకు ఉద్యోగ భద్రత చట్టాన్ని తీసుకురావాలని- చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నాయని తెలియజేశారు.
గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీసం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సి ఆర్ టి లకు ఇచ్చే వేతనమైన ఇవ్వాలని సూచించారు. గురుకుల పాఠశాలలో జరుగుతున్న సమ్మె వలన ముంపు మండలాల్లోనే విద్యార్థులు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వరదలతో ఇబ్బంది పడి చదువుకున్నారు, ఇంతలోనే టీచర్లు డిప్యూటేషన్లు తదితర సమస్యల వలన విద్యకు దూరమవుతున్నారు. కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరితంగా సమస్యను పరిష్కరించి విద్యార్థులకు మంచి చదువును అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు, అలానే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 9న రంపచోడవరంలో జరిగే ఆరు తెగల సంస్కృతిక సమ్మేళనం రేలా పనులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో చింతూరు ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి సోడీ రాఘవయ్య పాయం సాయిరాం కారం సాయి , తెలంగాణ గణేష్ కారం తేజ , సవలం వంశీ సోడీ ప్రవీణ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. (Story :ఫిబ్రవరి 9న జరిగే ‘రేలా ‘పండగ ను విజయవంతం చేయండి)