పూర్వవిద్యార్థుల సమ్మేళనం కాదు
అపూర్వవిద్యార్థుల సమ్మేళనం
న్యూస్‌తెలుగు/వనపర్తి: రాణీ లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ ఉత్సవాలు వేలాదిమంది పూర్వవిద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎం.పి రావుల. చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ 50ఎండ్లలో చదువుకున్న విద్యార్థులు ఒకచోట కలుసుకొని ఆత్మీయత, అనురాగలతో గత స్మృతులను నెమరువేసుకుంటూ ఈ ప్రాంగణం కోలాహలంగా ఉంది అని ఇట్టి సమావేశంలో పాల్గొని మిమ్మలని కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. నాతో పాటు మాజీ ఎం.ఎల్. ఎలు జయారాములు,డాక్టర్.బాలకిస్తయ్య,చిన్నారెడ్డి,నిరంజన్ రెడ్డిలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేశామని అదేవిధంగా నేటి పాలకులు కూడా అభివృద్ధి చేయాలని కాంక్షించారు. ఇక్కడికి వచ్చిన మీరంతా మంచి మధుర స్మృతులతో తిరిగి వెళ్లాలని అన్నారు.
న్యాయవాద వృత్తిలో ఉంటూ డిగ్రీ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన దినాలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు ఆర్.డి.ఓ లక్ష్మినారాయణ, చీర్ల.శ్రీనివాసులు,గులాం హుస్సేన్,జయంతి,బి.ఎల్. ఎన్ మూర్తి గార్లను మరియు కార్యక్రమ నిర్వాహకులుజి.శ్రీనివాసులు, అర్యభవన్.శ్రీనివాస్ రెడ్డి గార్లను ఘనంగా సన్మానించారు. రావుల చంద్రశేఖరరెడ్డి గారి వెంట వాకిటి.శ్రీధర్, నందిమల్ల.అశోక్ ఉన్నారు. (Story : పూర్వవిద్యార్థుల సమ్మేళనం కాదు అపూర్వవిద్యార్థుల సమ్మేళనం)