గ్రామ వార్డ్ వాలంటరీ సమస్యలు పరిష్కరించాలి
ఈనెల 26.27. 28. తేదీలలో చింతూరు ఐటీడీఏ ముందు నిరాహార దీక్ష
న్యూస్ తెలుగు /చింతూరు : గ్రామ వార్డ్ వాలంటరీ యూనియన్ (సిఐటియూ)అనుబంధ సంఘం రంపచోడవరం జిల్లా కమిటీ సమావేశం భూక్య కుమార్ అధ్యక్షతనలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు పల్లపు వెంకట్. గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డ్ వాలంటరీ సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్ వేతనాలు చెల్లించాలి. కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తూ అలానే వాలంటీర్లకు గౌరవ వేతనంగా పదివేల రూపాయలు ఇస్తామన్న మాట నిలిబెట్టుకోవాలి. లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న వాలంటరీ అందరు కూడా దీక్ష కార్యక్రమాలు చేపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. *అదే విధంగా చింతూరు. విఆర్ పురం.కూనవరం. ఎటపాక.మండలంలో ఉన్న వాలంటీర్లు అందరు కూడా వాలంటరీ సమస్యలు పరిష్కరించాలి అలానే వాలంటరీ ఉద్యోగ భద్రత కల్పించాలి వాలంటరీ వ్యవస్థని కొనసాగించాలని ఈనెల 26.27. 28. తేదీల్లో చింతూరు ఐటీడీఏలో మూడు రోజులు పాటు దీక్ష కార్యక్రమాన్ని నాలుగు మండలాల్లో ఉన్న వాలంటీరు అందరు కూడా జయప్రదం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్. రంపచోడవరం జిల్లా వాలంటరీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడియన్ జానీ. జిల్లా కమిటీ సభ్యులు. కలుముల మహేష్. కుమార్. సోడి దుర్గారావు . రామ్ రెడ్డి. రమేష్. స్రవంతి.పద్మావతి.శాంతి.రవి.తదితరులు పాల్గొన్నారు. (Story : గ్రామ వార్డ్ వాలంటరీ సమస్యలు పరిష్కరించాలి)