బాలికలకు నాణ్యమైన విద్యే లక్ష్యం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: బాలికలకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ అవార్డుల వేడుక నార్సింగిలో ఓం కన్వెన్షన్‌లో ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి రాశి సింగ్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. బీబీజీ అసోసియేట్స్ నుంచి పది లక్షలు, మేనేజ్‌మెంట్ నుంచి ఇరవై లక్షల చెక్కును బీబీజీ ఫౌండేషన్‌కు రాశి సింగ్ ద్వారా ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ఈ విరాళంతో 2040 నాటికి ఇరవై లక్షల మంది బాలికలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత భాగాన్ని బాలికలకు స్కాలర్‌షిప్‌లు, రివార్డులు, ఉన్నత విద్య కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు. అందరికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. (Story : బాలికలకు నాణ్యమైన విద్యే లక్ష్యం)