మెటా ఏఐ ఇప్పుడు బహుభాషలలో వర్తింపు
న్యూస్‌తెలుగు/ముంబయి: మెటా ఏఐ ఇప్పుడు హిందీతో సహా ఏడు కొత్త భాషల్లో అందుబాటులో ఉంది. లాటిన్ అమెరికాతో సహా ప్రపంచంలోని మరిన్ని దేశాలలో మొదటిసారిగా అందుబాటులో వచ్చింది. కొత్త మెటా ఏఐ క్రియేటివ్ టూల్స్‌ని పరిచయం చేశారు. తద్వారా మీ లక్ష్యాలకు జీవం పోయడం, మీ ఆలోచనలు, ఊహలను చిత్రాలుగా మార్చడం సులభం చేస్తుంది. కఠినమైన గణిత, కోడిరగ్ ప్రశ్నలు, మరింత క్లిష్టమైన ప్రాజెక్ట్‌ల కోసం మెటా ఏఐ లోపల మా అతిపెద్ద, అత్యంత సామర్థ్యం గల ఓపెన్ సోర్స్ మోడల్‌ని ఉపయోగించుకునే అవకాశం ఇప్పుడు ఉంది. మెటా ఏఐ ఇప్పుడు 22 దేశాలలో అందుబాటులో ఉంది, అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, మెక్సికో, పెరూ, కామెరూన్‌లలో సరికొత్తగా అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, ఫేస్‌బుక్ అంతటా మెటా ఏఐతో కొత్త భాషలలో పరస్పర సంభాషణలను చేయవచ్చు. హిందీ హిందీ-రోమనైజ్డ్ స్క్రిప్ట్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్ మరియు స్పానిష్ మరియు మరిన్ని రాబోతున్నాయి. (Story : మెటా ఏఐ ఇప్పుడు బహుభాషలలో వర్తింపు)