Home వార్తలు ఎన్‌ఐఐటీలో ఫ్యూచర్‌-రెడీ కెరీర్‌ ప్రోగ్రామ్‌ ప్రవేశానికి పరిమిత సీట్లు

ఎన్‌ఐఐటీలో ఫ్యూచర్‌-రెడీ కెరీర్‌ ప్రోగ్రామ్‌ ప్రవేశానికి పరిమిత సీట్లు

0

ఎన్‌ఐఐటీలో ఫ్యూచర్‌-రెడీ కెరీర్‌ ప్రోగ్రామ్‌ ప్రవేశానికి పరిమిత సీట్లు

న్యూస్‌తెలుగు/విజయవాడ: ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ (ఎన్‌యూ)లో అత్యాధునిక కెరీర్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని యూనివర్సిటీ వెల్లడిరచింది. అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ముగియనుంది. రాష్ట్ర కౌన్సెలింగ్‌లో తాము కోరుకున్న విభాగంలో సీటు పొందని దక్షిణ భారతదేశ అభ్యర్థులు తమ ప్రాధాన్య విభాగంలో సీటును ఎన్‌యూలో పొందే అవకాశం ఉంది, గరిష్టంగా 100% మెరిట్‌ ఆధారిత స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో బిటెక్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో బిటెక్‌, సైబర్‌ సెక్యూరిటీలో బిటెక్‌, బయోటెక్నాలజీలో బిటెక్‌, 3-సంవత్సరాల బిబిఎ మరియు 4-సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ – ఐఎంబీఏ (12వ తరగతి తర్వాత) అడ్మిషన్లు తెరవబడతాయి. విద్యార్ధులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మరియు డేటా సైన్స్‌లో బిటెక్‌ ని కూడా ఎంచుకోవచ్చు. అభ్యర్థులు సీయూఈటీ స్కోర్‌కార్డ్‌ను సమర్పించడం ద్వారా ఎన్‌యూఏటీ-ఎన్‌ఐఐటీ విశ్వవిద్యాలయం ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ నుండి మినహాయింపు పొందవచ్చు. (Story : ఎన్‌ఐఐటీలో ఫ్యూచర్‌-రెడీ కెరీర్‌ ప్రోగ్రామ్‌ ప్రవేశానికి పరిమిత సీట్లు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version