హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్‌తో 9000 గ్రామాలు ప్రభావితం
న్యూస్‌తెలుగు/ముంబయి: భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాలపై రూ.945.31 కోట్లు ఖర్చు చేశానని, ఆ ఏడాదికి సంబంధించిన సమగ్ర వార్షిక నివేదికలో పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ.125 కోట్లు పెరిగింది. తన సీఎస్‌ఆర్ బ్రాండ్, పరివర్తన్ కింద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్యక్రమాలు ఇప్పటివరకు 10.19 కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశాయి. అవి 9,000 గ్రామాలోని, 10 లక్షలకు పైగా కుటుంబాలకు చేరుకుంది. వీటిలో 112 జిల్లాలలో 85 చోట్ల కవరేజీని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌లో భారత ప్రభుత్వం గుర్తించింది. అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడంపై దృష్టి సారించిన పరివర్తన్ 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో పనిచేస్తుంది. గ్రామీణాభివృద్ధి: బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాలలో సహజ వనరుల నిర్వహణ, పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేద్యానికి మద్దతు, నేల, నీటి సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు, తన సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం మరియు కేంద్రీకృత అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామీణ భారతదేశంలో జీవన నాణ్యతను మెరుగుపరచేందుకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. మార్చి 31, 2024 నాటికి బ్యాంక్ 9000 గ్రామాలను కవర్ చేసింది. విద్యను ప్రోత్సహించడం: ఉపాధ్యాయులకు శిక్షణ, స్కాలర్‌షిప్‌లు, కెరీర్ గైడెన్స్ మరియు పాఠశాలలకు మౌలిక సదుపాయాల మద్దతు ద్వారా విద్యా నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించే కార్యక్రమాల కోసం బ్యాంక్ ఇప్పటి వరకు 2 కోట్ల మంది విద్యార్థులకు చేరువైంది. (Story : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్‌తో 9000 గ్రామాలు ప్రభావితం)