శ్రీమతి గంగినేని కల్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో సంక్రాంతి సంబరాలు
న్యూస్ తెలుగు / వినుకొండ : శ్రీమతి గంగినేని కల్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వినుకొండ లో మహిళా సాధికారత విభాగం మరియు పరిశోధన ఎక్సటెన్షన్ విభాగం వారి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్బంగా ప్రాంతీయ జూనియర్ కళాశాలల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో నూజెండ్ల, చీకటిగలపాలెం, ఉప్పలపాడు, బొల్లాపల్లి ఆదర్శ పాఠశాలలు, బొల్లాపల్లి, ఈపురు కస్తూర్బా గాంధీ పాఠశాలలు మరియు వినుకొండ జూనియర్ కళాశాలల నుండి 158 మంది విద్యార్ధినులు 79 టీమ్ లగా పాల్గొన్నారు. ఈ పోటీలు ఆద్యంతం ఆనందభరితంగా సాగాయి. ఈ పోటీలలో వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు బి. యేసమ్మ మరియు జె. శ్రీవల్లి మొదటి బహుమతి సాదించంగా, ఆదర్శ పాఠశాల, చీకటీగలపాలెం విద్యార్ధినులు ఓ. నాగేశ్వరీ మరియు ఈ. అభి దేవిక ద్వితీయ బహుమతి మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్, శావల్యాపురం విద్యార్ధినులు వి. తులసి మరియు ఆర్. స్వాతి సాధించారు. ఈ సంధర్బంగా ప్రథమ బహుమతి గా 10,000 రూపాయలను వై . పల్లవి , శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్, వినుకొండ వారు ద్వితీయ బహుమతి గా 7,000 రూపాయలను సిహెచ్. శిరీష అజయ్, ఆర్ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నరసరావుపేట మరియు తృతీయ బహుమతి గా 5,000 రూపాయలను తిప్పిశేట్టి మహేష్ , న్యూ పల్నాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు విద్యార్థినులకు బహుకరించి ప్రోత్సహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పడముత్యం రాజు , దేవతి శైలజ మరియు కజ్జయం విజయలక్ష్మి లు వ్యవహరించారు. పాల్గొన్న ప్రతి కళాశాలకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. పాల్గొన్న అందరూ విద్యార్థినిలకు ప్రశంసా పత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ద్వారా బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, వినుకొండ మున్సిపాలిటీ సిబ్బంది మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు పాల్గొని విజయవంతం చేసినందుకు కళాశాల సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (Story : శ్రీమతి గంగినేని కల్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో సంక్రాంతి సంబరాలు)