విజ్ఞాన విహారయాత్రను ప్రారంభించిన అడిషన్ కలెక్టర్
న్యూస్ తెలుగు /ములుగు : తెలంగాణా ప్రభుత్వం పర్యటశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 సందర్భంగా,జిల్లాలోని వివిధ పాఠశాల విద్యార్థులను విజ్ఞాన విహార యాత్రకు పర్యాటకశాఖ తరఫున వెళ్లడం జరిగింది. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జి, విజ్ఞాన విహారయాత్ర జెండాను ఊపి ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఆదేశాల మేరకు,పర్యాటక శాఖ అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ క్రిస్మస్ సూర్య కిరణ్ పర్యవేక్షణలో జవహర్ నగర్ లోని కేజీబీవీ,మదనపల్లిలోని కేజీబీవీ విద్యార్థులను, వరంగల్ కోట వేయి స్తంభాల, గుడి భద్రకాళి దేవాలయం, రామప్ప దేవాలయం,గ్రామప సదస్సు ప్రదేశాలను చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్, టూరిజం గైడ్స్ గోరంట్ల విజయకుమార్, వెంకటేష్, సేవా టూరిజం సభ్యులు శ్రీకాంత్ , మహేష్ పర్యాటక అభివృద్ధి సంస్థ హరిత హోటల్ లక్నవరం రామప్ప సిబ్బంది శివ రాము, ప్రవీణ్ శ్రావణ్ హటియా తదితరులు పాల్గొన్నారు. (Story : విజ్ఞాన విహారయాత్రను ప్రారంభించిన అడిషన్ కలెక్టర్)