UA-35385725-1 UA-35385725-1

చత్తీస్గడ్ మందు పాత్ర ప్రేలుళ్ల లో మృతి చెందిన‌ 5గురు మాజీ మావోయిస్టులే

చత్తీస్గడ్ మందు పాత్ర ప్రేలుళ్ల లో మృతి చెందిన‌ 5గురు మాజీ మావోయిస్టులే

న్యూస్‌తెలుగు/చింతూరు : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జనవరి 6న జరిగిన నక్సల్స్ పేలుళ్లలో 8 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఎనిమిది మంది సైనికుల్లో ఐదుగురు మాజీ నక్సలైట్లు, అంటే నక్సల్ భావజాలాన్ని విడిచిపెట్టి లొంగిపోయిన మావోయిస్టులు పోలీస్ రిక్రూట్మెంట్ లో చేరారని ఐ జి సుందర్ రాజ్ పట్వా తెలిపారు..
బీజాపూర్, దంతెవాడలో లొంగిపోయిన తర్వాత అమరులైన సైనికులు బలగాల్లో చేరారు: అమరులైన హెడ్ కానిస్టేబుల్ బుధ్రామ్ కోర్సా, కానిస్టేబుల్ డుమ్మా మార్కం, పాండ్రు రామ్, బమన్ సోధి, అందరూ జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) సైనికులని బస్తర్ ఐజి సుందర్‌రాజ్ పి తెలిపారు. కానిస్టేబుల్ సోమడు వెట్టి బస్తర్ ఫైటర్స్ ముందు చురుకైన నక్సలైస్ అని లొంగిపోయిన తర్వాత పోలీసులలో చేరారని . కోర్సా, సోధి బీజాపూర్ జిల్లాకు చెందినవారు కాగా, మిగిలిన ముగ్గురు పొరుగున ఉన్న దంతేవాడ జిల్లాకు చెందినవారని తెలిపారు. . బస్తర్ డివిజన్‌లోని స్థానిక యువకులు, లొంగి పోయిన మావోయిస్టులతో డిఆర్‌జి సిబ్బందిని నియమించారన్నారు .
గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న వామపక్ష తీవ్రవాద ముప్పుపై పోరాడేందుకు బస్తర్‌లోని ఏడు జిల్లాల్లో వేర్వేరు సమయాల్లో స్థానిక గిరిజన యువకులను డి ఆర్ జి పేరుతొ పోలీస్ సిబ్బంది ని పెంచామన్నారు . ఇది మొదటిసారిగా 2008లో కంకేర్ (నార్త్ బస్తర్), నారాయణపూర్ (అబుజ్ మడ్ తో సహా) జిల్లాల్లో సిబ్బంది పెరిగిందన్నారు . ఐదేళ్ల విరామం తర్వాత, 2013లో బీజాపూర్, బస్తర్ జిల్లాల్లో బలగాలను పెంచామన్నారు. అనంతరం, ఇది సుక్మా, కొండగావ్ జిల్లాలకు విస్తరించబడిందన్నారు . 2014, 2015లో దంతెవాడలో బలగాలను పెంచామ న్నారు.బస్తర్ ఫైటర్స్‌లో బస్తర్ యువతకు అవకాశం: రాష్ట్ర పోలీసుల ‘బస్తర్ ఫైటర్స్’ యూనిట్ 2022 సంవత్సరంలో ఏర్పడిందని , ఇందులో స్థానిక సంస్కృతి, భాష, భూభాగం తెలిసిన స్థానిక బస్తర్ యువకులను నియమించామని తెలిపారు.ఆలా నియమించిన వారిలో 5గురు వాహనం ప్రేలుళ్ళు లలో మృతి చెందారని తెలిపారు. (Story :చత్తీస్గడ్ మందు పాత్ర ప్రేలుళ్ల లో మృతి చెందిన‌ 5గురు మాజీ మావోయిస్టులే)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1