తిరుపతి తొక్కిసలాటలోనలుగురు మృతి
న్యూస్ తెలుగు/తిరుపతి : తిరుపతిలో వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల సందర్భంగా మొత్తం 3 చోట్ల భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం, విష్ణు నివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూలు వద్ద తోపులాటలు చోటు చేసుకుంది . బైరాగిపట్టెడ వద్ద తోపులాటలో భక్తులు గాయపడ్డారు. దీంతో వారిని రక్షించేందుకు పోలీసులు, తోటి భక్తులు CPR చేసి వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడ్డ వారిని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. ఊహించని స్థాయిలో భక్తులు తరలిరావడం, ఒక్కసారిగా అందర్ని లోపలికి పంపించడంతో తోపులాట జరిగి తొక్కిసలాట చోటు చేసుకుంది . సాయంత్రం నుంచి భక్తులు టోకెన్ల కోసం 9 ప్రాంతాల్లోని 95 కేంద్రాల వద్ద బారులు తీరారు.(Story : తిరుపతి తొక్కిసలాటలో నలుగురు మృతి )

