తెలుగు ప్రేక్షకులకు నవీన్ పొలిశెట్టి మెసేజ్..
త్వరలోనే పెద్ద సినిమాలతో అందరినీ అలరిస్తానని ప్రకటన
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా : బాక్సాఫీస్ దగ్గర మూడు వరుస బ్లాక్ బ్లస్టర్స్‌తో మెప్పించిన యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి. థియేట్రికల్‌గానే కాకుండా ఓటీటీలోనూ నవీన్ నటించిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో ఆయనతో సినిమా చేయటానికి నిర్మాతలు ఆసక్తి చూపించారు.
నవీన్ పొలిశెట్టి సినీ ఇండస్ట్రీలోకి తనకు తాను ఎవరి అండదండలు లేకుండా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ తక కష్టం, ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వైవిధ్యంగాకథాంశాలను ఎంచుకునే నవీన్ చిత్రాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూడటం ప్రారంభించారు. అయితే తన ప్రయాణం అనుకున్నంత సులువుగా జరగలేదు. ఇటీవల దురదృష్టవశాత్తు ఓ ప్రమాదానికి గురయ్యారు నవీన్. దీంతో ఆయన చేతికి పలు గాయాలయ్యాయి. దీంతో ఆయన కొన్నాళ్లు షూటింగ్స్‌లో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఓ భావోద్వేగభరితమైన ప్రకటనను వెలువరిచిన నవీన్ మొట్టమొదటిసారి ప్రమాదం జరిగినప్పుడు తగిలిన గాయాల నుంచి జరుగుతున్న ఫిజియోథెరఫీ చికిత్స గురించి తెలియజేస్తూ గాయాల నుంచి కష్టం మీద కోలుకుంటున్నానని పేర్కొన్నారు. తన సినిమాల మీద ప్రభావం చూపించిన ఇలాంటి గాయాల నుంచి శారీరకంగా, మానసికంగా కోలుకోవటం చాలా కష్టం. అయితే నవీన్ చాలా త్వరగా కోలుకుంటున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటున్నానని తన అభిమానులకు తెలియజేశారు నవీన్.
అసలు నవీన్ పొలిశెట్టి ఎక్కడున్నాడంటూ అందరూ అడగటం మొదలు పెట్టారు. దీంతో అసలు కారణాన్ని ఈ యంగ్ హీరో అధికారికంగా ప్రకటించారు. ప్రమాదంలో చేయికి బలమైన గాయాలు తగిలాయని, ఆ చేతిని కొన్ని నెలలుగా ఉపయోగించటం చాలా కష్టంగా మారిందని చెప్పిన నవీన్.. అభిమానులు, ప్రేక్షకుల ప్రేమాభిమానాలే తనను ముందుకు నడిపిస్తున్నాయని అన్నారు. హీరోగా నెక్ట్స్ రేంజ్‌కు చేరుకుంటున్న తరుణంలో ఇలాంటి ప్రమాదం జరగటం కాస్త ఇబ్బందికరమే అయినా, నవీన్ కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతారనటంలో సందేహం లేదు.
ప్రస్తుతం నవీన్ పని చేయాలనుకుంటున్న సినిమాలకు సంబంధించిన మేకర్స్ మంచి కంటెంట్, గ్రిప్పింగ్ కథ, కథనాల కోసం రెండేళ్ల సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇది యాదృచ్చికంగానే జరిగింది. నవీన్ కూడా అంతే! ఎక్కువ సినిమాలు చేయటం కంటే మంచి క్వాలిటీ ఉన్న కంటెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందచేయాలనేది ఆయన లక్ష్యం. దీన్ని ఆయన ముందు నుంచి ఫాలో అవుతున్నారు. అందువల్లనే మంచి సినిమాలను నవీన్ అందించగలిగారు.
నవీన్ పొలిశెట్టి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఈ సమయంలో ఆయన తన సినిమాలకు సంబంధించి రైటింగ్, దానికి సంబంధించిన డెవలప్‌మెంట్ వర్క్ మీద ఫోకస్ చేసినట్లు తెలియజేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, నిహారిక ఎంటర్‌టైన్మెంట్‌లలో సినిమాలు చేయాల్సి ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత నవీన్ ఓ సినిమా తర్వాత మరో సినిమాను పూర్తి చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మరిన్ని వైవిధ్యమైన సినిమా కథలను చదువుతున్నానని రీసెంట్‌గానే తన సోషల్ మీడియా ద్వారా నవీన్ పేర్కొన్నారు. రాబోయే ఏడాది నవీన్ పొలిశెట్టి, అతని అభిమానులకు ఎంతో కీలకంగా మారనుంది. ఎందుకంటే యంగ్ సెన్సేషన్ నుంచి సినిమాలు రూపొందనున్నాయి. ఈ క్రమంలో అభిమానులు నవీన్ పొలిశెట్టి రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. (Story : తెలుగు ప్రేక్షకులకు నవీన్ పొలిశెట్టి మెసేజ్..)