ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యమదే
విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక
న్యూస్‌తెలుగు/విజయనగరం: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఐపిఎస్ సోమవారం నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీగారు 44 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక” ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, డిటిసి డిఎస్పీ ఎం. వీరకుమార్, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, సిఐలు కే.కే.వి.విజయనాధ్, ఈ. నర్సింహ మూర్తి, డిసిఆర్బి ఎస్ఐ మురళి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story: ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యమదే)