Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వైసిపి ఆధ్వర్యంలో వైయస్ జయంతి వేడుకలు

వైసిపి ఆధ్వర్యంలో వైయస్ జయంతి వేడుకలు

0

వైసిపి ఆధ్వర్యంలో వైయస్ జయంతి వేడుకలు

న్యూస్ తెలుగు/విజయనగరం: మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు, ఆదర్శాలకు పునరంకితమవుదామని వైసిపి నగర అధ్యక్షులు ఆశపు వేణు పిలుపునిచ్చారు. సోమవారం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయం వద్దనున్న వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైయస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆసపు వేణు మాట్లాడుతూ పేద ప్రజల హృదయాలలో చెరగని ముద్ర ను వేసుకున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు అనుసరణీయమని అన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంటు, 108, 104 వంటి అనేక ప్రజా రంజిక పథకాలను అందిస్తూ మంచి పాలన అందించారన్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ వాగ్దానాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్పొరేటర్ అల్లు చాణక్య మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆదేశాలతో నగరంలో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుజ్జల నారాయణరావు, వైసీపీ నాయకులు బొంగ భానుమూర్తి, వరహాచారి, నామాల సర్వేశ్వరరావు, ముద్దాడ ఆదినారాయణ, గుండ వీరభద్రరావు, గండబోయిన సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. (Story: వైసిపి ఆధ్వర్యంలో వైయస్ జయంతి వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version