పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలి
వనపర్తి (న్యూస్ తెలుగు) : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వాణిజ్యపరమైన ఆస్తులకు సంబంధించిన పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంచిత్ గంగ్వార్ తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు, ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీల్లో వాణిజ్య భవనాలు, ఆస్తులను గుర్తించి పన్నుల వసూళ్లు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించవద్దని తెలిపారు. వేసవిలో ప్రజలకు తాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి లభ్యతను నిర్ధారించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా, మున్సిపాలిటీలలో బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రదేశాలలో చలి వేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పార్కుల్లో పక్షులు, ఇతర మూగ జీవుల కోసం నీటి కుంటల ఏర్పాట్లు చేయాలని సూచించారు. నర్సరీలలో లక్ష్యానికి తగ్గట్లుగా మొక్కల లభ్యతను ఏర్పాటు చేయాలని సూచించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవసరమైన చోట్ల ట్రాఫిక్ లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు మున్సిపాలిటి వార్డుల్లో ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో వనపర్తి మునిసిపల్ కమిషనర్ పూర్ణ చందర్ సహా పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల కమిషనర్లు, డీఈలు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు. (Story: పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!