Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ లబ్ది కోసం సొంత బాబాయినే చంపేశాడు!

రాజకీయ లబ్ది కోసం సొంత బాబాయినే చంపేశాడు!

0

రాజకీయ లబ్ది కోసం సొంత బాబాయినే చంపేశాడు!

ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

పెదవేగి (ఏలూరు-న్యూస్‌ తెలుగు): వివేకా హత్య కేసులో జగస్ రెడ్డి పాత్రపై విచారణ పూర్తి స్థాయిలో జరగాలని, గొడ్డలి పోటుతోనే బాబాయి చనిపోయారు అని జగన్ రెడ్డి అంత కచ్చితంగా ఎలా చెప్పారని, జగన్ కి అంతా తెలిసే జరిగిందని, వివేకా హత్య కేసులో కర్త, కర్మ క్రియ అన్ని జగన్ రెడ్డి ముఠాయే చేసిందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సీబీఐ విచారణ పిటిషన్ వేస్తానని సునీతమ్మ అంటే జగన్ ఎందుకు ఆపారని, మొదట సీబీఐ విచారణ కోరిన జగన్ రెడ్డి తరువాత వద్దు అనడం వెనుక కారణాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చింతమనేని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ రెడ్డి సీబీఐ విచారణ పిటిషన్ ను ఎందుకు వెనక్కి తీసుకున్నారని, బాబాయిని చంపిన అబ్బాయిని జగన్ రెడ్డి రక్షించడం వెనుక అంతర్యం ఏమిటని చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. వివేకా ఎలా చనిపోయారో జగన్ కి తెలుసు, మరి దాన్ని ఎందుకు దాచాలనుకుంటున్నారు? జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కేసు విచారణలో పురోగతి ఎందుకు ఆగిపోయింది? అని ప్రశ్నించారు. తన తండ్రికి న్యాయం చేయాలని కూతురు పోరాడుతుంటే తమ్ముడిని సీబీఐ అరెస్ట్ చేయకుండా జగన్ అడ్డుపడ్డారని, హై ప్రొఫైల్ కేసులో కూడా ఇంత జాప్యానికి జగన్ రెడ్డి కారణం అని సునీత చెప్పారని, నిజం బయటకు రాకుండా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆపుతున్నారని, కర్నూలులో అవినాష్ ను అరెస్టు చేయడానికి వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించింది వైసీపీ నేతలే అని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. తన సోదరి వైఎస్ సునీత రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు జగస్ రెడ్డి అండ్ కో సమాధానం చెప్పాలని, జగన్ రెడ్డి ఇప్పటికైనా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వివేకానందరెడ్డిని చంపిన నిజం ఒప్పుకోవాలన్నారు. ఇప్పటికైనా వైసీపీ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని, ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు జగన్ కు కనీస అర్హత కూడా లేదని, ఆడబిడ్డకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు.
విలువలు, విశ్వసనీయత, మాట తప్పను.. మడమ తిప్పను లాంటి సోది డైలాగులు చెప్పడం ఇకనైనా వైసీపీ నాయకులు ఆపాలని, వివేకాను చంపిన వారిని వదిలిపెడితే మంచికి, చెడుకు అర్థం లేకుండా పోతుందని, పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధం కాదు… హంతకులకు, రాష్ట్ర ప్రజలకు మధ్య ఇపుడు యుద్ధం అని చింతమనేని తెలిపారు.
సునీత చేస్తున్న న్యాయపోరాటంలో ఆమెకు టీడీపీ అండగా ఉంటుందని, వివేకానంద రెడ్డిని క్రూరంగా గొడ్డలితో నరికి నరికి చంపిన నరహంతకులకు శిక్ష పడకపోతే రేపు పౌరుని మాన, ప్రాణాలకు కూడా రక్షణ ఉండదని, సునీత న్యాయపోరాటానికి 5 కోట్లమంది ప్రజలు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలనీ చింతమనేని కోరారు.
ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండాలంటే కచ్చితంగా సునీతమ్మ చెప్పినట్లుగా జగన్ రెడ్డిని ప్రజలు ఓడించాలనీ చింతమనేని ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. (Story: రాజకీయ లబ్ది కోసం సొంత బాబాయినే చంపేశాడు!)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version