వినాయక పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోండి..
వన్ టౌన్- సిఐ. నాగేంద్రప్రసాద్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :
పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ కూడా వినాయక పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని తెలిపారు. పండుగ సమయంలో గొడవ లకు కక్షలకు ఇది వేదిక కాకూడదని తెలిపారు.. ఎవరైనా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గొడవలకు ఇతర అవార్డుచనీయ సంఘటనకు కారకులైతే వారిపైన తీవ్రమైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. కావున పట్టణ ప్రజలందరూ కూడా పండుగను మాత్రమే జరుపుకొని తమ కుటుంబాన్ని సుఖ సంతోషాలకు ఉండేటట్లు అవకాశం ఇవ్వాలని తెలిపారు (Story : వినాయక పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోండి..)