Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తిరుమలలో భక్తులకు తిలక ధారణ ప్రారంభించిన టిటిడి ఈవో

తిరుమలలో భక్తులకు తిలక ధారణ ప్రారంభించిన టిటిడి ఈవో

0

తిరుమలలో భక్తులకు తిలక ధారణ ప్రారంభించిన టిటిడి ఈవో

న్యూస్‌తెలుగు/తిరుమల : తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని టిటిడి ఈవో శ్రీ జె.శ్యామల రావు శుక్రవారం ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు, భక్తులకు శ్రీవారి సేవకులు తిలక ధారణ చేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలో భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి సేవకులు తిరుమలలోని ఏటిసి, సుపథం, శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, విక్యూసి 1 మరియు 2 ల వద్ద నిరంతరాయంగా తిలక ధారణ చేస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, పిఆర్ఓ (ఎఫ్ ఏసి) కుమారి పి.నీలిమ, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. (Story : తిరుమలలో భక్తులకు తిలక ధారణ ప్రారంభించిన టిటిడి ఈవో)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version