ఎన్నికలకు సన్నద్ధంకండి!
విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక
విజయనగరం (న్యూస్ తెలుగు): ఆర్మ్‌డ్ రిజర్వు మొబిలైజేషన్ ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 22న పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన పరేడ్ కు జిల్లా ఎస్పీ ఎం.దీపిక ముఖ్య అతిథిగా హాజరై, ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ – కొద్ది రోజుల్లో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరూ అంకిత భావంతో, ధృఢ సంకల్పంతో పని చేయాలని, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే చెక్ పోస్టుల్లో పని చేసే సిబ్బంది మరింత అప్రమత్తంగా, సమర్థవంతంగా పని చేయాలని, అక్రమ రవాణకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లాల పునర్విభజన తరువాత ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని, ఎంతో సంయమనంతో పని చేసి, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేసి రాబోయే ఎన్నికల్లో కూడా పని చేయాలని, శాంతియుతంగా, స్వేచ్చగా ఎన్నికల నిర్వహణకు కృషి చెయ్యాలని జిల్లా ఎస్పీ పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి ఎం.దీపిక చర్యలు చేపట్టడంతో, ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది తమ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, పలువురు రిజర్వు ఇనపెక్టర్లు, సిఐలు, అర్.ఎస్.ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు. (Story: ఎన్నికలకు సన్నద్ధంకండి!)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!