రికార్డు బ్రేక్! జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్!
న్యూదిల్లీ: భారతీయ చలన చిత్ర రంగంలో కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు నెలకొల్పింది. ఒకప్పుడు తెలుగు సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఈనాడు జాతీయ అవార్డులను సైతం తెలుగు సినిమాలే కైవసం చేసుకునే స్థాయికి టాలీవుడ్ చేరింది. 2021వ సంవత్సరంలో ఇండియా మూవీ వరల్డ్‌ను షేక్ ఆడించిన ఆర్ఆర్ఆర్, పుష్ప, ఉప్పెన మూవీలు అవార్డులతో చరిత్ర సృష్టించాయి. సినిమా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారంనాడు ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. జాతీయ అవార్డులు ప్రకటించిన ఇప్పటికి 69 ఏళ్లు గడిచాయి. ఈనాటి వరకు తెలుగు హీరో ఎవ్వరికీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రాలేదు. తొలిసారిగా బన్నీకి ఈ అవార్డు దక్కింది. తగ్గేదేలే అంటూ ఒకేఒక్క డైలాగ్‌తో దేశం మొత్తాన్ని ఊపేసిన బన్నీ జాతీయ అవార్డు కొట్టేసి, అందర్నీ దిమ్మదిరిగేలా చేశాడు. ఈ అవార్డు కోసం రేసులో ఉన్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్‌లు నిరాశపడక తప్పలేదు. ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరిలో పురుషోత్తమచార్యులు (తెలుగు)కు అవార్డు దక్కింది. ఆర్ఆర్ఆర్, పుష్పలకు ఎక్కువ అవార్డులు దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరానికి 281 ఫీచర్ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది.
ఇదిలావుండగా, ఉత్తమ నటి అవార్డును ఈసారి ఇద్దరు పంచుకున్నారు. అలియా భట్ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్(మిమి)లకు దక్కాయి. 2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైంది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా సర్దార్ ఉద్ధమ్, ఉత్తమ గుజరాతీ చిత్రం ‘ఛల్లో షో’ (భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్‌కు వెళ్లింది), ఉత్తమ కన్నడ చిత్రంగా ‘777 చార్లీ’, ఉత్తమ మలయాళీ చిత్రంగా ‘హోమ్’ ఎంపికయ్యాయి. హిందీ నుంచి ‘గంగూబాయి కాఠియావాడి’, తెలుగు నుంచి ‘పుష్ప’, ‘ఆర్ఆర్‌ఆర్’ అత్యధిక కేటగిరిల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నటుడు సహా, ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫీ (ప్రేమ్ రక్షిత్), ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ (కింగ్ సాలమన్- ఆర్ఆర్ఆర్), ఉత్తమ గేయ రచయిత (చంద్రబోస్ -కొండపొలం), ఉత్తమ నేపథ్య గాయకుడు (కాల భైరవ- కొమురం భీముడో), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్- పాటలు), ఉత్తమ సంగీత దర్శకుడు (ఎం.ఎం.కీరవాణి- నేపథ్యం) అవార్డులు దక్కించుకున్నారు. బన్నీకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కడం పట్ల యావత్ టాలీవుడ్ అభినందనలు తెలిపింది. అల్లు రామలింగయ్య మనవడిగా, సినీ వారసునిగా అడుగుపెట్టిన
జాతీయ అవార్డులు-2021 విజేతలు జాబితా ఇదే!
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్ (మీమీ)
ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి -మరాఠీ)
ఉత్తమ సహాయ నటి:పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్-హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి-హిందీ)
ఉత్తమ యాక్షన్ డైరక్షన్: కింగ్ సాలమన్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ గీత రచన: చంద్రబోస్ (కొండపొలం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: నాయట్టు (మలయాళం)
ఉత్తమ సంభాషణలు, అడాప్టెడ్: సంజయ్‌లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి- హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్ ఉద్దమ్ (అవిక్ ముఖోపాధ్యాయ)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయఘోషల్ (ఇరివిన్ నిజాల్ – మాయావా ఛాయావా)
ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్- కొమురం భీముడో)
ఉత్తమ బాల నటుడు: భావిన్ రబారి (ఛల్లో షో-గుజరాతీ)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం :ఆర్‌ఆర్‌ఆర్ (రాజమౌళి)
ఉత్తమ సంగీతం(పాటలు): దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)
ఉత్తమ సంగీతం(నేపథ్య): కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ మేకప్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కాఠియావాడి)
ఉత్తమ కాస్ట్యూమ్స్: వీర్ కపూర్ (సర్దార్ ఉద్దమ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సర్దార్ ఉద్దమ్ (దిమిత్రి మలిచ్, మన్సి ధ్రువ్ మెహతా)
ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)
ఉత్తమస్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస మోహన్ (ఆర్‌ఆర్ఆర్)
ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనింగ్): అనీష్ బసు (చైవిట్టు-మలమాళం)
ఉత్తమ ఆడియోగ్రఫీ (రీరికార్డింగ్): సినోయ్ జోసెఫ్ (ఝిల్లి డిస్కర్డ్స్- బెంగాలీ)
ఉత్తమ తెలుగు చిత్రం : ‘ఉప్పెన’
ఉత్తమ చిత్ర విమర్శకుడు : పురుషోత్తమచార్యులు (తెలుగు) (story: రికార్డు బ్రేక్! జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్!)
See Also
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106