చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
న్యూయార్క్: ఒక బాలిక కాలుమీద చికెన్ ముక్క పడి గాయమైనందుకు, కోర్టు ఆమెకు దాదాపు 7 కోట్ల రూపాయల నష్టపరిహారం అందించేలా తీర్పునిచ్చింది. ఈ ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. చికెన్ మెక్‌నగెట్స్‌ను సరఫరా చేసే మెక్‌డోనాల్డ్ కంపెనీ ఈ నష్టపరిహారాన్ని భరించాల్సి వచ్చింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరగ్గా, ఫ్లోరిడా కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఒలీవియా కారాబలో అనే 8 ఏళ్ల అమ్మాయి కాలుమీద చికెన్ ముక్క పడి వేడి కారణంగా గాయమైనందుకు మెక్‌డోనాల్డ్ కంపెనీ ఆమెకు 800,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 6.57 కోట్ల రూపాయలు) నష్టపరిహారం ఇవ్వాలని ఫ్లోరిడా కోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ బీబీసీ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. బీబీసీ కథనం ప్రకారం, 2019లో ఒలీవియా కారాబలో వయస్సు 4 సంవత్సరాలు. ఆమె కోసం ఆమె తల్లిదండ్రులు ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ సమీపంలోని టమారక్‌లో మెక్‌డోనాల్డ్స్ డ్రైవ్‌త్రూ షాపులో హ్యాపీమీల్ ఆర్డర్ చేశారు. ఆ పాప దాన్ని ఓపెన్ చేయగానే అందులోని చికెన్ మెక్‌నగెట్ ఆమె కాలుపై పడి, 2 సెంటీమీటర్ల విస్తీర్ణంలో శరీరం కాలిపోయింది. ఒక్కసారిగా ఆమె భయంతో కేకలుపెట్టి, ఏడ్చింది. ఈ గాయం కారణంగా ఆమె కాలికి మచ్చ కూడా ఏర్పడిరది. దీంతో ఒలీవియా తల్లిదండ్రులు వినియోగదారుల కోర్టులో కేసు వేశారు. ఫ్లోరిడా జ్యూరీ తాజాగా ఇచ్చిన తీర్పులో ఒలీవియాకు గాయమైనందుకు, ఆమె నొప్పితో బాధపడినందుకు, అలాగే ఇన్నాళ్లూ మానసిక వేదనకు గురైనందుకు గాను ఆమెకు 800,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 6.57 కోట్ల రూపాయలు) నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గడిచిన నాలుగేళ్ల నష్టానికి సగం డబ్బు, భవిష్యత్‌లో మరో నాలుగేళ్లకు ఇంకో సగం డబ్బు కింద మెక్‌డోనాల్డ్ కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని ఉత్తర్వుల్లో వివరించింది. ఒలీవియాకు 1,56,000 డాలర్లు ఇవ్వాలని వారి తరపు లాయర్ వాదించినప్పటికీ, కోర్టు 8 లక్షల డాలర్లకే పరిమితమైంది. (Story: చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం)
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106