Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బాల్య వివాహాలు నేరం

బాల్య వివాహాలు నేరం

0

బాల్య వివాహాలు నేరం

న్యూస్‌తెలుగు/చింతూరు: బాల్య వివాహాలు జరపటం చట్టరీత్య నేరమని పోలవరం జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ లతా శ్రీ పేర్కొన్నారు. పోలవరం జిల్లా ఎస్పీ చక్రవర్తి, ఎస్ డి పి ఓ ఉదయ పావని ఆదేశాల మేరకు గురువారం చింతూరులోని జూనియర్ కళాశాల సమావేశ మందిరంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలు జరగకముందే కనిపెట్టి సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన పేర్లు గొప్యం గా ఉంచబడతాయని ఆమె పేర్కొన్నారు. అలాగే విద్యార్థినిలు, మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వాట్సాప్ లో వేధించినా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే సెల్ ఫోన్ వాడకం జ్ఞానాన్ని పెంచు కోవటానికి ఉపయోగించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టులో పి ఓ,పని చేస్తున్న అంగనవాడి టీచర్లతో బాల్య వివాహాలు జరగకుండా నిరోధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బాల్యవాలను నిరోధంపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడియస్ పి.ఓ జయలక్ష్మి, చింతూరు ఎస్సై సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story: బాల్య వివాహాలు నేరం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version