విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
- Vijay Beast Movie Review: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతోపాటు తెలుగు తదితర భాషల్లో కూడా విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బీస్ట్’ ఆ అంచనాలను అందుకుందా? నయనతారతో కోకిల, శివ కార్తికేయన్‌తో డాక్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన సూపర్‌హిట్ సొంతం చేసుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ తన ఖాతాలో మూడో హిట్‌ను వేసుకోగలిగారా?
- స్టయిలిష్ హీరో విజయ్ దళపతికి తెలుగులో మంచి ఫాలోయింగ్ వుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. కొన్ని చోట్ల ఆర్‌ఆర్‌ఆర్ మూవీని ఎత్తేసి ఈ సినిమాను ప్రదర్శించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే, ఆరంభం ఒక షాపింగ్ మాల్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. ఆ మాల్‌పై ఐఎస్‌ఐ ఉగ్రవాదులు దాడిచేసి, దాన్ని హైజాక్ చేస్తారు. అప్పటికే రష్‌గా ఉన్న మాల్‌లో చాలామంది కస్టమర్లు ఉంటారు. వారంతా ఉగ్రవాదుల చెరలో బందీలవుతారు. వారంతా అమాయక ప్రజలు. తమ ఉగ్రవాద నాయకుడు ఉమర్ ఫరూక్‌ను వెంటనే విడుదల చేయాలని, లేదంటే బందీలను చంపేస్తామని టెర్రరిస్టులు ప్రభుత్వాన్ని బెదిరిస్తారు. అటుచేసి ఇటుచేసి ఉమర్ ఫరూక్‌ను విడుదల చేయడానికే ప్రభుత్వం సుముఖంగా వుంటుంది. కానీ అంతలోనే ఓ ట్విస్ట్. రా ఏజెంట్ వీర రాఘవ (విజయ్) కూడా ఆ మాల్‌లోనే ఇరుక్కుపోతాడు. అందరిలా అతను సామాన్యుడు కాదు, అలాగే అమాయకుడు కూడా కాదు. ఈ విషయం ఉగ్రవాదులకు తెలియదు. ఒక పద్ధతి ప్రకారం టెర్రరిస్టులను రివర్స్‌లో భయపెడుతుంటాడు హీరో. ఉగ్రవాదుల నుంచి అమాయక ప్రజలను కాపాడేందుకు వీర రాఘవ ఏం చేశాడు? షాపింగ్ మాల్‌లో ఏం జరిగింది? అసలు వీర రాఘవ గతం ఏంటి? వీర రాఘవ అసలు ప్రభుత్వం మాట కూడా వినడెందుకని? టెర్రరిస్టు నాయకుడు ఉమర్‌ను ప్రభుత్వం వదిలేసిన తర్వాత అతను ఏం చేస్తాడు? అనే అంశాల ఆధారంగా కథ ఆసక్తిదాయకంగా సాగుతుంది. ఫైనల్‌గా హీరో ఎలా ముగింపు పలికాడనేది తెరపై చూడాల్సిందే. ఇప్పుడంత కొంపలేమీ మునగలేదనుకుంటే, ఓటీటీలో వచ్చే దాకా వేచిచూడాల్సిందే.
- వీర రాఘవ పాత్రలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, వీర రాఘవ పాత్రలో విజయ్ అద్భుతంగా రాణించాడు. పూర్తిస్థాయి వినోదాన్ని అందించాడు. తనదైన స్టయిలిష్ నటనను యధావిధిగా చూపించాడు. పూజా హెగ్డే మరోసారి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా క్యూట్‌గా నటించిన పూజా హెగ్డే తన డ్యాన్స్‌తోనూ అలరించింది. మిగతా వారికి పాత్రలు పెద్దగా లేవని చెప్పవచ్చు. ఉగ్రవాదుల పాత్రలో నటులంతా జీవించారు. విజయ్ తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించారు.
- ‘బీస్ట్’ మూవీ సాంకేతికంగా పరిణతి చెందిన చిత్రంగా నిలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సాంకేతిక సిబ్బంది కూడా ఎవరి పనిని వారు విజయవంతంగా పరిపూర్తి చేసినట్లు కన్పిస్తుంది. ఇప్పటి వరకు నయనతారతో కోకిల, శివ కార్తికేయన్‌తో డాక్టర్ సినిమాలను డైరెక్ట్ చేసి, సూపర్‌హిట్స్ సొంతం చేసుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను చాలావరకు బాగానే లాగించాడు. కామెడీ పెద్దగా వర్కవుట్ కాకపోయినా, విజయ్ అభిమానులను దృష్టిలో వుంచుకొని నెల్సన్ సినిమాపై కాన్‌సెంట్రేషన్ చేసినట్లుగా అగుపిస్తుంది. అయినప్పటికీ, దర్శకునిగా ఎక్కువ మార్కులు కొట్టేసినట్లే. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మెస్మరైజ్ చేశాడు. కీలక సన్నివేశాల సమయంలో మ్యూజిక్ వాటికి ప్లస్ అయింది. స్క్రీన్ ప్లే పరవాలేదు. యాక్షన్ సీక్వెన్స్ ఇంట్రస్ట్‌గా అన్పిస్తాయి.
- సినిమాను విశ్లేషిస్తే, ‘బీస్ట్’ పూర్తిగా విజయ్ దళపతి వన్ మ్యాన్ షో. టెర్రరిస్టుల నుంచి విజయ్ అమాయక ప్రజలను కాపాడే సన్నివేశాలు మంచి ఫీస్ట్ అందిస్తాయి. సినిమా సాంతం విజయ్ తప్ప ఇంకెవ్వరూ కన్పించరు. ఫస్టాఫ్ అదిరిపోయింది. సెకండాఫ్ కాస్త స్లో అన్పించింది. లాగ్ అయినట్లుగా కన్పిస్తుంది. ఓవరాల్‌గా విసుగు పుట్టే పరిస్థితి వుండదు. సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించిన ‘అరబిక్ కుత్తు…’ సాంగ్ ధియేటర్‌లోనూ స్టెప్‌లు వేయిస్తుంది. కచ్చితంగా విజయ్ అభిమానులు పూనకంతో ఊగిపోతారు. కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ కూడా పరవాలేదు. అయితే పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ఐఎస్‌ఐని బిల్డప్ చేయడంలో దర్శకుడు కాస్త ఎక్కువగా చూపించాల్సి వుంటుంది. ఐఎస్‌ఐని బలహీనమైన సంస్థగా చూపించినట్లయింది. వినోదాత్మకంగా సినిమా మంచి ఫీలింగ్ ఇవ్వవచ్చు. కాకపోతే, ఐఎస్‌ఐ ఉగ్రవాదులను లోకల్ రౌడీషీటర్ల తరహాలో హీరో డీల్ చేయడం కరెక్ట్ కాదు. విలనిజం రేంజి ఎక్కువగా వుంటేనే…హీరో రేంజి కూడా పెరుగుతుంది. జనరల్ ఆడియన్స్‌ను పక్కనబెడితే, ఓవరాల్‌గా ‘బీస్ట్’ మూవీ పూర్తి వినోదాత్మకంగా, ఇంట్రస్టెంగ్‌గా వుంటుంది.
- ఈ మూవీకి రేటింగ్ 3.5/5 ఇవ్వవచ్చు.
- (గమనిక : ఈ చిత్ర సమీక్ష రచయిత అభిప్రాయానికి సంబంధించినది. న్యూస్‌తెలుగు.నెట్ అభిప్రాయంగా భావించవద్దు.) (Story: విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!)
-
See Also:
- దేవుడా! ఇదేం ఖర్మ! తిరుపతిలో నరకయాతన
-
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!
బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?
మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!